BREAKING
ఈయూ విస్తరణకు కొత్త నిబంధనలు గుండెజబ్బుల ముప్పు నుంచి బయటపడేందుకు జీవనశైలిలో మార్పులు అవసరం ఎల్పీజి -ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేశారా? నేడే చివరి గడువు! ఆక్రమిత భూములు మాత్రమే తొలగించిన అధికారులు గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత ఎస్ఐఆర్ ప్రక్రియలో పొరపాట్లకు తావివ్వొద్దు విద్య కమిటీలతో మంచి ఫలితాలు వస్తాయి. టిడిపి కూటమి ప్రభుత్వంలో నిరంతర విద్యుత్ ప్రజల ప్రాణాలతో చెలగాటం.. నకిలీ వైద్యుడు అరెస్ట్ పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి: ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కేసుల దర్యాప్తులో లోపాలకు తావివ్వొద్దు గ్రామ స్వరాజ్యం సాధన లక్ష్యంగా పల్లె పండుగ జిల్లాలో మొదటి రోజు సందడిగా ప్రారంభమైన పల్లె పండుగ కార్యక్రమం ఎమ్మెల్సీ ఓటు నమోదుకు పిలుపు కొండూరు పవన్ కుమార్ చింతపల్లి విద్యాకమిటీ ఎన్నికల్లోనూ చిత్ర విచిత్రలే...!

వరి పంట పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు..

Select Suryaa Now
వరి పంట పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు..


- రైతులకు పంట సంరక్షణపై పలు సూచనలు
నరసన్నపేట సెప్టెంబర్ 29 మేజర్ న్యూస్: బశివలస సమీపంలోని ముంపునకు గురైన పంట పొలాలను కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎస్. అనూష, డాక్టర్ ఎస్. కిరణ్‌కుమార్, జిల్లా వనరుల కేంద్రం ఏఓ వై. సురేష్, మండల వ్యవసాయ అధికారి వై. సూర్య కుమారి  తదితరులు మంగళవారం పరిశీలించారు. పొలాల్లో చాలా వరకు నీరు బయటకు వెళ్లిపోయిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటల సంరక్షణకు రైతులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. పొలాల్లో నీరు బయటకు వెళ్లిన అనంతరం ఎకరాకు 15 నుంచి 20 కిలోల వరకు యూరియా బూస్టర్ డోస్, 12 కిలోల వరకు పొటాష్ వేసుకోవాలని సూచించారు.
పంటకు కుళ్లు తెగులు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ అనూష సూచించారు. ఎకరాకు SAFF 400–500 గ్రాములు లేదా ప్రొపైకోనాజోల్ 200 మి.లీ. లేదా హెక్సాకోనాజోల్ 400 మి.లీ. మందును మొక్క మొదళ్ల వద్ద పిచికారీ చేయాలని తెలిపారు.
జిల్లా వనరుల కేంద్రం ఏఓ వై. సురేష్ మాట్లాడుతూ.. 13:0:45 లేదా 19:19:19 నీటిలో కరిగే ఎరువులను ఎకరాకు 2 కిలోల చొప్పున డ్రోన్ ద్వారా పిచికారీ చేస్తే ఆకుల ద్వారా నేరుగా పోషకాలు అందడంతో పంట త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
ముంపు అనంతరం పొలాల్లో తేమ అధికంగా ఉండటం, యూరియా వేసిన వెంటనే ఎండలు ఎక్కువగా ఉండటం వంటి పరిస్థితుల్లో దోమ (పురుగు) ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు సూచించారు. రైతులు తరచూ పొలాలను పరిశీలిస్తూ పురుగు ఉనికి, ఉధృతిని గమనించాలని తెలిపారు. ఉధృతి తక్కువగా ఉంటే ఎకరాకు ఏసిఫేట్ 300 గ్రాములు, మధ్యస్థంగా ఉంటే డైనటోఫ్యూరాన్ 80 గ్రాములు, అధిక ఉధృతి ఉంటే పైమెట్రోజిన్ 120 గ్రాములు పిచికారీ చేయాలని సూచించారు.
రైతులు పంట పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి, అవసరమైన సమయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకుని సస్యరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు.
ఈ పరిశీలనలో వీఆర్వో చక్రవర్తి, వీఏఏ బి. సంధ్యారాణి, వీఆర్ఏ శివాజీ తదితరులు పాల్గొన్నారు.