BREAKING
Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు పారిశ్రామికవాడలో పేదల పట్టాభిషేకం పేదవాడి ఆత్మగౌరవానికి ‘పట్టా’భిషేకం! స్థానిక సమరానికి వైకాపా సమరశంఖం : మళ్ళా విజయప్రసాద్ దిశానిర్దేశం 48వ వార్డులో 800 మంది పేద కుటుంబాలకు పేదలకు పట్టాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే పద్మనాభం ప్రశాంతంగా ముగిసిన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ ఎమ్ సి ) ఎన్నికలు

చోడపల్లిలో శ్రీ వినాయక చవితి వేడుకలు: అన్నసమారాధనలో పాల్గొన్న ఏ పి అర్ డి సి చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు

Select Suryaa Now
చోడపల్లిలో శ్రీ వినాయక చవితి వేడుకలు: అన్నసమారాధనలో పాల్గొన్న ఏ పి అర్ డి సి చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు

 

అచ్చుతాపురం సెప్టెంబర్. 27 మేజర్ న్యూస్..అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి నియోజకవర్గం, అచ్యుతాపురం మండలం చోడపల్లి గ్రామంలో శ్రీ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద నిర్వహించిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్  ఏ పి అర్ డి సి చైర్మన్, ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్  ప్రగడ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
​ముందుగా గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని, అన్నదానాన్ని  ప్రగడ నాగేశ్వరరావు  స్వయంగా వడ్డించారు.
​ఈ సందర్భంగా  ప్రగడ నాగేశ్వరరావు  మాట్లాడుతూ... ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దైవచింతన సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామంలో ప్రజలందరూ ఐకమత్యంతో, ఉత్సాహంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
​ఈ కార్యక్రమంలో ఒడిసెల పెదా అప్పారావుగారు, ఒడిసెల శ్రీను గారు, కర్రీ నాగేశ్వరరావు గారు, కర్రీ వెంకటరమణ గారు, గంజి వెంకటి గారు, పట్నాల భానుప్రసాద్ గారు, కర్రీ అప్పారావు, గెంజి చిన్నగారు, పితాని రమేష్ గారు ,స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు, పెద్ద ఎత్తున ప్రజలు మరియు భక్తులు పాల్గొన్నారు.