పద్మనాభం ప్రశాంతంగా ముగిసిన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ ఎమ్ సి ) ఎన్నికలు
పద్మనాభం,సెప్టెంబర్ 29,మేజర్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ మరియు ఆదేశాల మేరకు మంగళవారం పద్మనాభం మండల పరిధిలోని పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీల ( ఎస్ ఎం సి ) ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి.
మండల పరిధిలో మొత్తం 61 పాఠశాలలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ఇందులో 50 ప్రాథమిక పాఠశాలలు, 11 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 59 పాఠశాలల్లో ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించబడింది. ప్రతి పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీకి చైర్‌పర్సన్ మరియు వైస్ చైర్‌పర్సన్‌లను విజయవంతంగా ఎన్నుకున్నారు.అయితే, అనివార్య కారణాల వల్ల ఎంపీపీఎస్ కొత్తకొవ్వాడ మరియు ఎంపీపీఎస్ బుడ్డివలస పాఠశాలల్లో మంగళవారం జరగాల్సిన ఎస్ఎంసి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ రెండు పాఠశాలలకు తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికల తేదీని ప్రకటించి, ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.
మొత్తం మీద పద్మనాభం మండలంలో ఎస్ ఎం సి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా మరియు విజయవంతంగా నిర్వహించబడిందని మండల విద్యాశాఖాదికారులు రమణ ,బాబూలాల్ వెల్లడించారు.