48వ వార్డులో 800 మంది పేద కుటుంబాలకు పేదలకు పట్టాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి 800 మందికి పట్టాలు అందజేసిన గంకల కవితా అప్పారావు యాదవ్
48వ వార్డు ప్రజల కష్టాలను తన సొంత కష్టాలుగా భావిస్తున్నారని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై గంకల ప్రశంసలు
సీతమ్మధార సెప్టెంబర్ 29 మేజర్ న్యూస్. ;రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా 48వ వార్డులో 800 మంది లబ్ధిదారులకు మంగళవారం మాధవధార మాధవస్వామి కళ్యాణ మండపంలో ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు,48 వ వార్డు మాజీ కార్పొరేటర్,జీవీఎంసీ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు,జీవీఎంసీ మాజీ బిజెపి ఫ్లోర్ గంకల కవిత అప్పారావు యాదవ్ పాల్గొని చేతుల మీదుగా లబ్ధిదారులకు పేదలకు పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించి పట్టా సేల్ డీడ్‌లను స్వయంగా అందజేశారు.ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, పేదలకు సొంత ఇంటి స్థలంపై హక్కు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా పట్టాల పంపిణీ జరుగుతోందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గంకల కవిత అప్పారావు యాదవ్ మాట్లాడుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గంకు ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు గెలుపొందడం ఉత్తర నియోజకవర్గం ప్రజలు చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు. ముఖ్యంగా 48 వ వార్డు కొండ ప్రాంత ప్రజల కష్టాలను నేరుగా తన కష్టాలుగా భావించి ఎప్పటికప్పుడు సమస్యలపై తనతో రివ్యూ నిర్వహించి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని ప్రశంసలు జల్లు కురిపించారు.48వ వార్డులో ఎమ్మెల్యే స్పూర్తితోనే గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమం మొదలు పెట్టడం జరిగిందని అదే స్ఫూర్తితో ప్రతిరోజు సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం 48వ వార్డులో పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు అందజేసి ముందుగానే విజయదశమి పండుగను తీసుకువచ్చిందని కొనియాడారు. భవిష్యత్తులో 48 వ వార్డు ప్రజల సమస్యలను ఎమ్మెల్యే సహకారంతో పరిష్కారం చూపుతామని,ఎటువంటి సమస్య ఏర్పడిన తక్షణమే తన సంప్రదించాలని లబ్ధిదారులను గంకల కవిత అప్పారావు యాదవ్ కోరారు. పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు అందజేసి వారికి భరోసా కల్పించిన కూటమి ప్రభుత్వంకు,ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు, వార్డు మాజీ కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు యాదవ్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు ఉన్నారు.