నార్కట్‌పల్లిలో రైతులకు అవగాహన సదస్సు
నార్కెట్ పల్లి ,మేజర్ న్యూస్,
నార్కట్‌పల్లి లోని రైతు వేదికలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నల్లగొండ సెక్రటరీ హిమబిందు డి ఎల్ ఎస్ ఏ జడ్జి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం సోమవారం నాడుజరిగింది.రైతులు అడిగిన వివిధ సందేహాలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. రైతులు ఎక్కువగా భూ తగాదాల విషయాలు అడగడం జరిగింది. వాటికి తగిన సూచనలు మేడమ్ గారు అందించారు. అగ్రిమెంట్ పేపర్ లో సాదా బైనామాలు రాసుకోవద్దని, రాసుకున్న యెడల వాటిని సకాలంలో రిజిస్ట్రేషన్ చేసుకుని చట్టబద్ధత కల్పించుకోవాలని తెలిపారు.ఎక్కువగా రైతులు వివిధ ఆఫీసులలో అప్లికేషన్లు ఇచ్చినప్పుడు వారు దానికి తగిన రిసిప్ట్ లు ఇవ్వడం లేదని తెలపడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లలో రిసిప్ట్ ఇవ్వడం లేదని చాలా మంది రైతులు తెలపడం జరిగింది.
నార్కట్‌పల్లి మండలంలో నలుగురు పి ఎల్ వి లు రైతు వేదికలో వారానికి రెండు రోజులు అందుబాటులో ఉంటారని, వారిని సంప్రదించిన ఎడల వారు తగిన పత్రాలు తీసుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం నల్లగొండకు తీసుకు వస్తారని తెలిపారు. తెల్ల రేషన్ కార్డ్ కలిగిన వారికి భారత ప్రభుత్వం ఉచిత న్యాయ సేవ అందిస్తున్నదని, ఉచిత న్యాయాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కె. గౌతమ్ గారు, విష్ణు, పారా లీగల్ వాలంటీర్లు - ఎండి షబ్బీర్ హుస్సేన్ , అద్దంకి శ్రీశైల చారి, అరుణ జ్యోతి , పులిజాల రమేష్ , మరియు రైతులు వీరవెల్లి నర్సిరెడ్డి, మాండ్ర బత్తుల యాదగిరి రెడ్డి, బత్తుల రవీందర్ రెడ్డి, బత్తుల వెంకటరెడ్డి, పల్లె పహాడ్ బత్తుల శ్రీనివాస్ రెడ్డి, నగేష్ తొండలవాయి తదితరులు పాల్గొన్నారు.