BREAKING
రెడ్డి కుటుంబానికి ఘంటా సుధీర్‌ పరామర్శ ఐదేళ్లుగా పేరుకుపోయిన సహకార చక్కెర కర్మాగారాల కార్మికుల బకాయిలు విడుదల... కార్మికుల్లో ఆనందోత్సాహం ఒంగోలు ఉత్సవానికి సర్వం సిద్ధం ఐ సి డి ఎస్ సేవలపై అవగాహన కల్పించాలి ఘనంగా లోకబంధు విద్యాసంస్థల అధినేత తూముల పుట్టిన రోజు వేడుకలు: బాధిత కుటుంబానికి అండగా కూటమి ప్రభుత్వం -ఎమ్మెల్యే సతీమణి కూన ప్రమీల థియేటర్ల నుంచి స్ట్రీమింగ్ వరకు.. హాలీవుడ్ సినిమా బిజినెస్ మోడల్ ఎలా మారింది? ఏలూరు జిల్లాలో సంచలనం - MRO పై PGRS లో మహిళ ఫిర్యాదు. ప్రజావాణికి ఆదరణ కరువు...! రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం అర్హులందరికీ ప్రభుత్వ సాయం అందిస్తాం: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ​విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించాలి యువత భవితకు భరోసా" పురుగుమందు కలిసిన గడ్డి తిని 35 గొర్రెలు, మేకలు మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కాపరి కుటుంబం! రేబిస్‌పై అప్రమత్తతే రక్షణ

పందిళ్ల గ్రామంలో ప్రీ-ప్రైమరీ పాఠశాల ప్రారంభం

Select Suryaa Now
పందిళ్ల గ్రామంలో ప్రీ-ప్రైమరీ పాఠశాల ప్రారంభం

పందిళ్ల గ్రామంలో ప్రీ-ప్రైమరీ పాఠశాల ప్రారంభం

చిన్నారులకు నాణ్యమైన విద్య అందించాలి: సర్పంచ్ తోడేటి రమేష్

హుస్నాబాద్ : పందిళ్ల గ్రామంలో ప్రీ-ప్రైమరీ పాఠశాలను గ్రామ సర్పంచ్ తోడేటి రమేష్ ప్రారంభించారు. చిన్నారులకు చిన్ననాటి నుంచే విద్యపై ఆసక్తి పెంపొందించేలా ప్రీ-ప్రైమరీ విద్య ఎంతో కీలకమని సర్పంచ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది తాడూరి జాహ్నవి, తాడూరి లక్ష్మీలను సర్పంచ్ అభినందించారు. చిన్నారులకు ప్రేమతో, ఆప్యాయతతో విద్యాబోధన చేస్తూ వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.పాఠశాలలో చిన్నారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానని సర్పంచ్ తోడేటి రమేష్ తెలిపారు. పిల్లలకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య అందేలా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.ప్రీ-ప్రైమరీ పాఠశాల ప్రారంభంతో గ్రామంలోని చిన్నారులకు విద్యా అవకాశాలు మరింత చేరువయ్యాయని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు