BREAKING
మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానం ఎల్ నినో సమర్థవంతం ఎదుర్కొందాం రామాపురంలో పల్లెపండుగ ఏర్పాట్లు పరిశీలన మహిళల భద్రతే ధ్యేయం.. శక్తి యాప్‌పై విస్తృత అవగాహన వడ్డెరల భూములకు రక్షణ కల్పించండి సారూ..! ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వాతావరణాన్ని విద్యార్థుల కల్పించాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. ఆటపాటలతో కూడిన విద్యను బోధించాలి ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి* నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో అదిరిపోయే ట్విస్ట్.. సెకండ్ హాఫ్‌లో బాలయ్య సర్ప్రైజ్? రామాపురం పల్లెపండుగ జయప్రదం చేయండి పల్లెపండుగ 3.0 కార్యక్రమం విజయవంతం చేయాలి :ఎమ్యెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గ్రామ పంచాయితీ ల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సేవలు అభినందనీయం సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి 13 ఏళ్ల ఫర్హాన్‌ ఎక్కడ? ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

పురుగుమందు కలిసిన గడ్డి తిని 35 గొర్రెలు, మేకలు మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కాపరి కుటుంబం!

Select Suryaa Now
పురుగుమందు కలిసిన గడ్డి తిని 35 గొర్రెలు, మేకలు మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కాపరి కుటుంబం!

హిరమండలం సెప్టెంబర్ 28 మేజర్ న్యూస్

​హిరమండలం మండలం మర్రిగూడ పంచాయతీ పరిధిలోని భీమవరం కొండ సమీపంలో పురుగుమందుల అవశేషాలు ఉన్న గడ్డిని మేయడంతో దాదాపు 35 గొర్రెలు, మేకలు అకస్మాత్తుగా మృత్యువాత పడ్డాయి. పాతపట్నం మండలం కొరసవాడ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బతకల లక్ష్మీనారాయణ దాదాపు రెండు నెలల క్రితం తన జీవాలను మేత కోసం ఈ ప్రాంతానికి తీసుకురాగా, పచ్చగడ్డి మేస్తున్న క్రమంలో అవి ఒక్కసారిగా అస్వస్థతకు గురై కళ్లముందే కుప్పకూలిపోయాయి. మృతి చెందిన వాటిలో గర్భంతో ఉన్న జీవాలు కూడా ఉన్నాయని, పిల్లల చదువులు, కుటుంబ పోషణకు ఏకైక ఆధారమైన మూగజీవాలను ఒకే రోజులో కోల్పోవడంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని లక్ష్మీనారాయణ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ దారుణ ఘటనపై పశువైద్య అధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపి, జీవనాధారాన్ని కోల్పోయిన తమ పేద కుటుంబాన్ని ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.