13 ఏళ్ల ఫర్హాన్ ఎక్కడ? ఆచూకీ కోసం పోలీసుల గాలింపు
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్(సెప్టెంబరు, 28):
ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 ఏళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహ్మద్ ఫర్హాన్ (13) బాలాజీనగర్‌లోని మొహమ్మదీయ మసీదులో ఉంటూ ఖురాన్, ఉర్దూ నేర్చుకుంటున్నాడు. సెప్టెంబర్ 27న ఉదయం 7 గంటల సమయంలో మసీదు నుంచి బయటకు వెళ్లిన బాలుడు తిరిగి రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.అదృశ్యమైన సమయంలో బాలుడు తెలుపు-నలుపు రంగు టీషర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. సుమారు నాలుగు అడుగుల ఎత్తు, సాధారణ ఛాయతో ఉంటాడని, హిందీ, బెంగాలీ భాషలు మాట్లాడతాడని పేర్కొన్నారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌కు 8712662705 సమాచారం అందించాలని పోలీసులు కోరారు.రిపోర్టర్ గుర్రం రమేష్.