BREAKING
పలు అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం మహోత్సవాల కార్యక్రమం అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవాలు 800కు పైగా ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ నాగరాణి సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం శోభాయమానంగా పార్వతీపరమేశ్వరుల ప్రాకారోత్సవం జనసేన అభ్యర్థుల వినతుల స్వీకరణ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ నాగరాణి టిడిపి నాయకుడు కన్నన్ రెడ్డి జన్మదిన వేడుకలు జడ్పీటీసీ అధ్యక్షుడు పాలూరి మాల్యాద్రి రెడ్డికి ఘన సన్మానం క్యాద్గిరా గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం బేస్మెంట్ వరకే పరిమితం సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన ఆచార్య అల్లం శ్రీనివాసరావుకు మూడు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ‘నమో సేవా గాథ’ ప్రత్యేక వాహనం ప్రారంభం వాయుగుండంతో దెబ్బతిన్న రోడ్లను త్వరలోనే పునరుద్ధరిస్తాం గ్రామాల సర్వతోముఖాభివృద్ధే పల్లె పండుగ లక్ష్యం-మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

మహిళల భద్రతే ధ్యేయం.. శక్తి యాప్‌పై విస్తృత అవగాహన

Select Suryaa Now
మహిళల భద్రతే ధ్యేయం.. శక్తి యాప్‌పై విస్తృత అవగాహన

మహిళల భద్రతే ధ్యేయం.. శక్తి యాప్‌పై విస్తృత అవగాహన

జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో శక్తి బృందాల ప్రచారం

 

మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న జిల్లా పోలీసు శాఖ, ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ రక్షణ అందించే **‘శక్తి యాప్’**పై విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది.జిల్లా ఎస్పీ పి. జగదీష్  ఆదేశాల మేరకు సోమవారం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళా పోలీసులు, శక్తి బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి మహిళలు, యువతులకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు.బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలలు, రద్దీ మార్కెట్ ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించి, స్మార్ట్‌ఫోన్‌లో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే విధానం, అత్యవసర సమయంలో SOS బటన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించే ప్రక్రియను వివరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళల రక్షణ, భద్రతకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఆపద సమయంలో శక్తి యాప్ ద్వారా సమాచారం అందితే సమీపంలోని పోలీసు పెట్రోలింగ్ వాహనాలు, శక్తి బృందాలు తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.మహిళలు, విద్యార్థినులు భయపడకుండా శక్తి యాప్‌ను తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవాలని, అపరిచితుల వేధింపులు లేదా ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే యాప్ సేవలను వినియోగించుకోవాలని శక్తి బృందాల పోలీసులు సూచించారు.

ఏటీపీ ఆర్టీసీ బస్టాండ్ లో  మహిళలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు