గ్రామ పంచాయితీ ల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి
అధికారులతో సమావేశమైన డి ఎల్ డి వో కిరణ్ కుమార్ :
తె ర్లాం సెప్టెంబర్ 28 మేజర్ న్యూస్ : గ్రామ పంచాయితీ ల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి అని డి ఎల్ డి వో ఎం. కిరణ్ కుమార్ అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం లో పంచాయితీ సెక్రటరీ లతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ రథం స్వచ్ఛ పదం ఇంటి పన్నుల వసూలు బిగ్ బ్యాంక్ థియరీ స్వచ్చత కి సేవ పలు రకాల పథకాల పైన పలు రకాల సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పారిశుధ్యం తాగు నీటి సరఫరా పంచాయితీ ల పరిపాలన ప్రభుత్వ సంక్షేమo అభివృద్ది కార్య క్రమాలు అమలు పై దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యల ను క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పరిష్కరించాలని ఆయన కార్య దర్శి లను ఆదేశించారు. ప్ర భుత్వ పథకాలు అర్హులైన వారికి అందేలా చూడాలని కోరారు. పంచాయితీ ల పరిధిలో గల జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతి నీ నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఎం.పి.డి.ఓ.రేగి రాంబాబు పలు రకాల సూచనలు సలహాలు అందించారు. ఈ సమావేశంలో వారితో పాటు డిప్యూటీ ఎంపీడీవో సుబ్రహ్మణ్యం ఎ. ఓ.డి.వి.రమణ సిబ్బంది పంచాయితీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు