పల్లెపండుగ 3.0 కార్యక్రమం విజయవంతం చేయాలి :ఎమ్యెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి ,మేజర్ న్యూస్ :నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో జరిగే పల్లె పండుగ 3.0 కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని పట్టణంలోని టీడీపి నాయకులు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని ఎమ్యెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు .సోమవారం కనిగిరి పట్టణ టీడీపి నాయకులతో పల్లెపండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.క్లస్టర్ ఇంచార్జీలు ,వార్డు,యూనిట్ ఇంచార్జీలు ఇంటింటా తిరిగి ప్రజలు భారీగా తరలి వచ్చేలా చూడాలన్నారు .బహిరంగ సభకు వచ్చే వారికి బస్సులు ,భోజన వసతి కల్పించడం జరుగుతుందన్నారు .టీడీపి నాయకులు సమన్వయంతో పనిచేసి భారీ జన సమీకరణ చేయాలన్నారు .పల్లెపండుగ 3.0 కార్యక్రమానికి ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించడం, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలు, నాయకులు మరియు కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై చర్చించారు.ఈ సమావేశంలో పట్టణ టీడీపి అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ,తెలుగు యువత అధ్యక్షులు అచ్చాల రవి ,రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రాచమళ్ళ శ్రీనివాసులు రెడ్డి ,ఎన్ అంజి నాయుడు ,వివిఆర్ మనోహరరావు ,షేక్ రహీమాన్ ,బుల్లా బాలబాబు ,షేక్ షరీఫ్ ,సద్గురు ,రీటా ఫయాజ్ ,చీర్ల నాగార్జున యాదవ్ తదితరులు ఉన్నారు .