BREAKING
పలు అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం మహోత్సవాల కార్యక్రమం అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవాలు 800కు పైగా ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ నాగరాణి సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం శోభాయమానంగా పార్వతీపరమేశ్వరుల ప్రాకారోత్సవం జనసేన అభ్యర్థుల వినతుల స్వీకరణ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ నాగరాణి టిడిపి నాయకుడు కన్నన్ రెడ్డి జన్మదిన వేడుకలు జడ్పీటీసీ అధ్యక్షుడు పాలూరి మాల్యాద్రి రెడ్డికి ఘన సన్మానం క్యాద్గిరా గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం బేస్మెంట్ వరకే పరిమితం సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన ఆచార్య అల్లం శ్రీనివాసరావుకు మూడు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ‘నమో సేవా గాథ’ ప్రత్యేక వాహనం ప్రారంభం వాయుగుండంతో దెబ్బతిన్న రోడ్లను త్వరలోనే పునరుద్ధరిస్తాం గ్రామాల సర్వతోముఖాభివృద్ధే పల్లె పండుగ లక్ష్యం-మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

రామాపురంలో పల్లెపండుగ ఏర్పాట్లు పరిశీలన

Select Suryaa Now
రామాపురంలో పల్లెపండుగ ఏర్పాట్లు పరిశీలన

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

 మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి పరిశీలించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

భారీ సభకు అధికార యంత్రాంగం సమాయత్తం

సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పరిశీలించారు. సహచర మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి సభా ప్రాంగణం, ఇతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రామాపురంలో భద్రత, పార్కింగ్‌, తాగునీరు, ఇతర మౌలిక వసతుల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు.