BREAKING
యువతరానికి స్ఫూర్తి ప్రధాత భగత్ సింగ్ ఇరు వర్గాల గొడవ - నలుగురు రిమాండ్ వ్యాపార రంగంలో కష్టపడి పనిచేస్తే మంచి అభివృద్ధి సాధించవచ్చు విజయవాడ సాంస్కృతిక వైభవానికి ప్రతీక విజయవాడ ఉత్సవ్.. శ్రీశ్రీశ్రీ ప్రాచీన శివరామ క్షేత్ర ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నరసాపురం–విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి *పరికరాల పంపిణీ జోరు..!* తక్కువ నీటితో దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. సూపర్ ఎల్‌నినో విపత్తులోనూ చీమకుర్తికి తాగునీరు అందించాం:మంత్రి నిమ్మల ‘ఈసీ’పై కాంగ్రెస్ ఫైర్..! ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు డా. గోపే ఎంపిక జంగారెడ్డిగూడెం రాప్ తొలగింపుపై రగడ గ్రామాభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీలదే కీలక బాధ్యత: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్జీలపై అలసత్వం వద్దు నీట్ ర్యాంకర్ కార్తీక్‌కు కరాటం రాంబాబు అభినందనలు

అర్హులందరికీ ప్రభుత్వ సాయం అందిస్తాం: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

Select Suryaa Now
అర్హులందరికీ ప్రభుత్వ సాయం అందిస్తాం: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

 

హుజూర్ నగర్ 
టౌన్ మేజర్ న్యూస్


*పేదలకు కొండంత అండగా సీఎంఆర్‌ఎఫ్‌*
హుజూర్‌నగర్‌ 
*నియోజకవర్గంలో రూ.21.62 కోట్ల విలువైన చెక్కుల పంపిణీ*
*8 మండలాల్లోని 5,319 మంది లబ్ధిదారులకు ఆర్థిక భరోసా*

తీవ్ర అనారోగ్యం, ఆపదలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) కొండంత అండగా నిలుస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ అనారోగ్య సమస్యలతో కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఆయన ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలకు చెందిన మొత్తం 5,319 మంది బాధితులకు దాదాపు రూ.21.62 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అనారోగ్యం బారినపడి ఆర్థికంగా చితికిపోయిన పేద కుటుంబాలను ఆదుకోవడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో సీఎంఆర్‌ఎఫ్‌ నిధులను మంజూరు చేయించి బాధితులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వైద్య ఖర్చుల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తున్నామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు 5,319 కుటుంబాలకు ఏకంగా రూ.21.62 కోట్ల మేర ఆర్థిక సాయం అందడం నియోజకవర్గ చరిత్రలోనే ప్రత్యేకమని పేర్కొన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా లభించిన ఈ నిధులు ఎన్నో కుటుంబాలను అప్పుల ఊబి నుంచి గట్టెక్కించాయని చెప్పారు.

*ప్రజా సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం*

ప్రజారోగ్య పరిరక్షణతో పాటు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. ఆపదలో ఉన్నవారికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. సహాయం అందుకున్న లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు తమ కష్టకాలంలో ఇంతటి భారీ మొత్తంలో ఆర్థిక సాయం అందించి ఆదుకున్నందుకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
       ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పి కె. నరసింహ,
రాష్ట్ర పేరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ హరి సింగ్, ఆర్డిఓ శ్రీనివాసులు, మునిసిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, ఎఎంసి రాధికా దేశ్ ముఖ్, గ్రంధాలయం చైర్మన్ బచ్చు రామారావు,  తహసీల్దార్ కవిత  
స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు