యువత భవితకు భరోసా"
* బొబ్బిలిలో అచ్చీవర్ స్టడీ హాల్" ను సందర్శించిన ఎమ్మెల్యే బేబీనాయన
బొబ్బిలి, సెప్టెంబర్ 28: మేజర్ న్యూస్:
డీఎస్సీ పై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టి, యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే బేబినాయన తెలిపారు. అందులో భాగంగా "యువత భవితకు భరోసా" అనే కార్యక్రమంతో ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో ఉన్న స్టడీ సెంటర్లను సందర్శించి, యువతతో మాట్లాడి వారికి డీఎస్సీ పై వస్తున్న అపోహలు తొలగిస్తున్నారు.ఈ మేరకు ఎమ్మెల్యే బేబినాయన సోమవారం బొబ్బిలిలో ఉన్న అచ్చీవర్ స్టడీ హాల్ ను సందర్శించి, యువతతో మమేకమై వారికి వాస్తవ పరిస్థితులను వివరించి, వారి భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలలో మాట ఇచ్చిన విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత డీఎస్సీ ద్వారా యువతకు కొన్ని వేల ఉద్యోగాలను కల్పించామని అన్నారు. అలానే ప్రతీ సంవత్సరం డీఎస్సీ ద్వారా ఇంకా ఎన్నో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఏపిపిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చామని, దశలవారీగా వాటికి సంబంధించిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ* కూడా జరుగుతుందని తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలమేరకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే వారి నియోజకవర్గ పరిధిలో ఉన్న కోచింగ్ సెంటర్లకు వెళ్లి విద్యార్థులతో మమేకమై, మీలో ధైర్యాన్ని పెంపొందించేలా చేస్తున్నామని అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి కొందరిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది, అటువంటివి నమ్మకుండా మీ శ్రమను, కష్టాన్ని నమ్ముకుని పోటీ పరీక్షలలో మంచి మార్కులు సాధించి, ప్రభుత్వ ఉద్యోగాలను పొందాలని సూచించారు. మంత్రివర్యులు నారా లోకేష్ మన రాష్ట్ర యువతకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో పరీక్షలు నిర్వహిస్తోందని, తల్లిదండ్రుల ఆశలమేరకు యువతకు మంచి భవిష్యత్తు అందించేందుకు కట్టుబడి ఉందని స్పష్టతనిచ్చారు.