BREAKING
ప్రధాన ఎన్నికల కమిషనర్ జాగ్నేష్ కుమార్ రాజీనామా చేయాలి టిపిసిసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి విద్యార్థులు భగత్ సింగ్ వారసులుగా ఎదగాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వేలాది మందితో విద్యార్థి మహా ప్రదర్శన సర్వసిద్ధి పీ.హెచ్.సీ పరిధిలో 3,161 మంది చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ! అంధుల క్రికెట్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు : మంత్రి నారా లోకేష్ భరోసా ఏ ఎం ఆర్ అక్రమ టోల్ గేట్ పై మాజీ డీజీపీ పోరు! గ్రామీణాభివృది పనుల పై ప్రత్యేక దృష్టి సారించాలి. మండలాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి --జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ పశ్చిమ గోదావరి ఎక్సైజ్ శాఖకు Q2లో రూ. 369.62 కోట్ల రాబడి; 25 మద్యం షాపులకు నోటిఫికేషన్ అంకితభావంతో విధులు నిర్వర్తించాలి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవత్సవ బలిజ కుల బాంధవుల సేవే లక్ష్యంగా నిరంతర కృషి బంగారం షాప్ లో చోరీ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం రీసర్వేలో అలసత్వం సహించేది లేదు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రీసర్వే పురోగతిపై మంత్రి పొంగులేటి అసంతృప్తి నవంబర్ 15లోగా నాణ్యతతో రీసర్వే పూర్తి చేయాలి – అధికారులకు మంత్రి ఆదేశం ప్రొద్దుటూరులో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య తహశీల్దార్ పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు హైదరాబాద్ లో 'బిల్ట్రస్ట్' గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ * రూ.450 కోట్ల పెట్టుబడి... కొత్తగా వేయి మందికి ఉద్యోగాలు * 2,600 మంది బీ2బీ సరఫరాదారులు, 14 మిలియన్ల కొనుగోలుదారులకు సేవలు * లాంఛనంగా ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పి.గన్నవరం టీడీపీ ఇన్‌చార్జిగా మోకా ఆనందసాగర్ నియామకం

ఐదేళ్లుగా పేరుకుపోయిన సహకార చక్కెర కర్మాగారాల కార్మికుల బకాయిలు విడుదల... కార్మికుల్లో ఆనందోత్సాహం

Select Suryaa Now
ఐదేళ్లుగా పేరుకుపోయిన సహకార చక్కెర కర్మాగారాల కార్మికుల బకాయిలు విడుదల... కార్మికుల్లో ఆనందోత్సాహం

 

ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలకు జీవో విడుదల!
కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన శ్రామిక సంఘం

ఎస్.రాయవరం, సెప్టెంబర్ 28, మేజర్ న్యూస్:
ఐదు సంవత్సరాలుగా పేరుకుపోయిన సహకార చక్కెర కర్మాగారాల కార్మికుల బకాయిలు విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేయడంతో సోమవారం సాయంత్రం చక్కెర కర్మాగార కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతూ పండుగ చేసుకుంటున్నారు.

అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం ఏటికొప్పాక సహకార చక్కెర కర్మాగారంలోని శ్రామిక కార్మికులకు బకాయిలు చెల్లించేందుకు 13 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ సందర్భంగా ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ గేట్ ముందు శ్రామిక సంఘం నేతలు సోమవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు.
శ్రామిక సంఘం జేఏసీ చీఫ్ సెక్రటరీ అల్లు నర్సింహామూర్తి, అధ్యక్షులు ఎర్రన్న నాయుడు, జనరల్ సెక్రటరీ గుండుబోగుల గోవిందరావు, కోశాధికారి సీ.హెచ్.ఎన్.జే.ప్రకాష్ కార్మికులతో కలిసి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఐదేళ్లపాటు బకాయిల కోసం ఎదురుచూశామని ఆవేదన వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే తమ నిరీక్షణకు న్యాయం చేసిందని, 164 మంది కార్మికులకు బకాయిలు చెల్లించేందుకు జీవో విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనితలకు శ్రామిక సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బకాయిలు విడుదల కావడంతో షుగర్ ఫ్యాక్టరీల శ్రామిక సంఘాలు ఆనందోత్సవం జరుపుకున్నాయి