రెడ్డి కుటుంబానికి ఘంటా సుధీర్ పరామర్శ
రెడ్డి కుటుంబానికి ఘంటా సుధీర్ పరామర్శ
టి.నరసాపురం, మేజర్‌న్యూస్ : మండల కేంద్రమైన టి.నరసాపురం గ్రామానికి చెందిన రెడ్డి సూర్యనారాయణ ( పాపారావు ) కుటుంబాన్ని సోమవారం కామవరపుకోట మాజీ జడ్పీటీసీ ఘంటా సుధీర్‌బాబు పరామర్శించారు. సూర్యనారాయణ కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే మృతిచెందారు. ఈ క్రమంలోనే సుధీర్‌బాబుతో పాటు ద్వారకాతిరుమల మండలానికి చెందిన తెలుగుదేశం యువ నాయకులు వాసిరెడ్డి ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పీఆర్వో వుయ్యూరు శుభాష్, ద్వారకాతిరుమల మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు టి.నరసాపురంలోని సూర్యనారాయణ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతో పాటు ఆయన కుమారుడు రమేష్‌ను పరామర్శించారు.