BREAKING
ఓటీటీని షేక్ చేయడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'అక్క' గ్యాంగ్‌స్టర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ వేడుకలో కార్తికేయ భావోద్వేగ ప్రసంగం.. కంటతడి పెట్టుకున్న రమా రాజమౌళి! అనంతపురంలో కేవలం రూ.10లకే కార్పొరేట్ స్థాయి ఫిజియోథెరపీ వైద్యం.. డాక్టర్ కోనంకి శ్రీధర్ సేవలు 'వారణాసి' చిత్రంలో ఏఐ వినియోగంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. అసలు నిజం ఇదే! ఓటీటీలోకి సరికొత్త మైండ్ గేమ్ షో.. హోస్ట్‌గా యంగ్ హీరో తేజ సజ్జ! Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు

ప్రజావాణికి ఆదరణ కరువు...!

Select Suryaa Now
ప్రజావాణికి ఆదరణ కరువు...!


మోమిన్‌పేట్,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 28):ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి క్రమంగా ప్రజల నుంచి ఆదరణ తగ్గుతోంది. మోమిన్‌పేట్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సృజన సాహిత్య ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఒక్క ఫిర్యాదు కూడా అందకపోవడంతో అధికారులు బోసిపోయి కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది.గత నెల నుంచి ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రజలు తమ సమస్యలను అధికారులకు నేరుగా విన్నవించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ప్రతి వారం ఫిర్యాదుల సంఖ్య తగ్గుతుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రజావాణి నిర్వహిస్తున్న విషయం ప్రజలకు పూర్తిస్థాయిలో తెలియకపోవడం వల్లే స్పందన తగ్గిందా? లేక ప్రజల్లో ఈ కార్యక్రమంపై ఆసక్తి లేకపోవడమే కారణమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.మరోవైపు ప్రజావాణి కార్యక్రమంపై గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతి సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్న విషయాన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తే ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మండల స్థాయి ప్రజావాణిని నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.రిపోర్టర్ మాణిక్య చారి.