BREAKING
150 ఏళ్ల చరిత్రకు ఒంగోలు ముస్తాబు ఘనంగా రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు వేడుకలు.. అభిమానులతో కలిసి మూడు భారీ కేక్‌లు కట్ చేసిన స్టార్ హీరో గొరపూడి అసైన్డ్ భూముల సమస్యపై సానుకూల హామీ - ప్రగడ నాగేశ్వరరావు సమక్షంలో రైతులతో అధికారుల చర్చలు సమంత ప్రెగ్నెన్సీ ఫొటోలు, వీడియో వైరల్.. పికిల్ బాల్ గేమ్‌లో సందడి చేసిన స్టార్ హీరోయిన్ అంగన్వాడీ టీచర్లు ఆయాలకు సన్మానం రెవెన్యూ సేవలపై ప్రజల్లో భగ్గుమంటున్న అసంతృప్తి వై ఎస్ ఆర్ సి పి జిల్లా సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ గా రత్నం కుమార్ అమేజాన్ రక్షణకు బ్రెజిల్ కొత్త వ్యూహం ఎంఎస్ఎంఈ, ఎగుమతి, వ్యవసాయ రంగాలతో వాల్‌మార్ట్ భాగస్వామ్యం రూ 6.25 కోట్లతో రహదారులకు శంకుస్థాపన పనులు ఏఐ విప్లవంతో హార్డ్‌వేర్ రంగంలో భారీ పెట్టుబడులు _పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పిర్యాదు దారులతో మాట్లాడిన .....ఎస్పి నరసింహ ఐపిఎస్ ...... పీఎం స్వనిధితో వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర నైజీరియా కోర్టు సంచలన తీర్పు

పింఛనుదారులకు గుడ్ న్యూస్‌

Select Suryaa Now
పింఛనుదారులకు గుడ్ న్యూస్‌

1వ తేదీ ఉద‌యం నుంచే పింఛ‌న్ల పంపిణీ
- 61.80 లక్షల మందికి రు. 2692.34 కోట్లు విడుద‌ల‌
- గ‌జ‌ప‌తిన‌గ‌రం మండ‌లంలో రు. 6 ల‌క్ష‌లు NSAP ఖాతాల‌కు జ‌మ‌
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్

సూర్య, స్టేట్ బ్యూరో : 

 రాష్ట్రంలోని ఎన్టీఆర్ భరోసా పింఛనుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గతంలో ప్రకటించినట్టుగా సవరించిన వేళలతో సంబంధం లేకుండా, ఎప్పటిలాగే అక్టోబర్ 1వ తేదీ ఉదయం 6:30 గంటల నుంచే లబ్ధిదారుల ఇంటి వద్దే పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు  రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు తమ సమ్మెను విరమించడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది లేక‌పోవ‌డంతో ముందస్తు ప్రణాళిక ప్రకారమే పింఛన్ల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు. సెప్టెంబర్ 30వ తేదీనే స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు సిబ్బంది బ్యాంకుల నుంచి 100% పింఛను నగదును విత్‌డ్రా చేసుకుని.. అక్టోబ‌ర్ 1వ తేదీ ఉద‌యం నుంచే ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు వెళ్లి పింఛ‌న్ల న‌గ‌దు అంద‌జేస్తార‌ని తెలిపారు. అక్టోబ‌ర్ నెలకు గాను ప్రభుత్వం ఇప్పటికే రూ.2,692.34 కోట్లను విడుదల చేసింద‌ని.. ఇందులో రూ.2,692.28 కోట్లను పంచాయతీ / వార్డుల ఖాతాలకు జమ చేయగా, రూ. 6 లక్షలను గజపతినగరం మండలంలోని NSAP పింఛనుదారుల ఖాతాలకు డీబీటీ (DBT) ద్వారా జమ చేస్తార‌ని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 30 నాటికి అవసరమైన నగదు సిద్ధంగా ఉండేలా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు (PDs), ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, SLBC మరియు బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని 61.80 లక్షల మంది పింఛనుదారుల‌కు ప్ర‌తి నెలా 1వ తేదీనే స‌కాలంలో పింఛ‌న్లు అందించే బాధ్య‌త ప్ర‌భుత్వం తీసుకుంద‌ని మంత్రి కొండ‌ప‌ల్లి స్ప‌ష్టం చేశారు.