BREAKING
కమ్మ పాలెం అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసోత్సవ వేడుకలు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు సైన్స్ బస్ యాత్ర విశ్వభారతిలో టీఆర్‌ఎస్‌వీ జెండా రెపరెపలు 2026 నాటి విమానాల డెలివరీ లక్ష్యంపై ఎయిర్‌బస్ ధీమా పల్లె పండుగకు భారీగా తరలిన ప్రజలు లైసెన్స్ మద్యం షాప్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు..... పడారుపల్లి పీహెచ్‌సీలో పోషణ కార్యక్రమం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ నెల్లూరు సీడీపీఓ టి. అరుణ దేశంలో చారిత్రాత్మక అక్షరాస్యత ప్రగతి పెదభోగిల లో " ఇంటింటికి మన్యం పోలీస్ " పలు అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మాసం మహోత్సవాల కార్యక్రమం,ఐ సి డి ఎస్ రంగనాయకులపేట సెక్టర్ సూపర్వైజర్ కే.విజయలక్ష్మి ఎన్నికల సమయంలో సమస్యాత్మక వార్డుల్లో ప్రత్యేక నిఘా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల విద్యుత్ కేటగిరీ మార్పుపై కృతజ్ఞతలు ప్రపంచ హృదయ దినోత్సవం 2026 పద్మశాలి భవనానికి 2 కోట్ల నిధులు విడుదల బాచేపల్లి తాండ విద్యా కమిటీ చైర్మన్గా కృష్ణ నాయక్

సీఈ సి జ్ఞానేశ్ కుమార్​ను దేశద్రోహిగా ప్రకటించి అరెస్ట్ చేయాలి.... జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

Select Suryaa Now
సీఈ సి జ్ఞానేశ్ కుమార్​ను దేశద్రోహిగా ప్రకటించి అరెస్ట్ చేయాలి.... జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి:ఎన్నికల ప్రక్రియను నిర్వీర్యం చేస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్​ను దేశద్రోహిగా ప్రకటించి అరెస్ట్ చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు  డిమాండ్ చేశారు. కామారెడ్డి  కలెక్టరేట్ వద్ద ఓటు చోరీపై సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి ముందుగా కాంగ్రెస్​ నాయకులు నివాళులర్పించారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం కలెక్టర్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు మాట్లాడుతూ.. ఓటు చోరీ అంశాన్ని వెలుగులోకి తెచ్చిన రాహుల్ గాంధీ వెంట దేశం మొత్తం నిలబడుతోందన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని విమర్శించారు. కుటిల నీతితో ఓట్లను తొలగించి ఫారం-6ను ఏకపక్షంగా తయారు చేసి యువకులను ఓటు హక్కులో పాల్గొనకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ అని పేర్కొన్నారు. ఓటు చోరీపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తమ నియోజకవర్గాల్లో విదేశీయులు ఎవరున్నారో ఎంపీ అర్వింద్​ చూపించాలని, అసంబద్ధమైన మాటలు మాట్లాడటం తప్పని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ ఇలియాస్, మాజీ డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సందీప్ తదితరులు పాల్గొన్నారు.