BREAKING
ఫలించిన గుకేశ్ వ్యూహం.. మూడో గేమ్ డ్రా ఫోక్సో కేసులో నిందితుడికి సంవత్సరం జైలు శిక్ష. తీవ్ర ఒడిదుడుకుల తర్వాత నిలదొక్కుకుంటున్న ఆసియా షేర్లు ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆదర్శ కుటుంబం’: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వెంకటేశ్, త్రివిక్రమ్ సినిమా కేంద్ర బడ్జెట్ 2027-28 రూపకల్పనకు ముందస్తు సంప్రదింపులు పూర్తి ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాలు రూ.127 లక్షల కోట్లకు చేరిక కమర్షియల్ లెక్కలు లేకుండా చేసిన సినిమా: ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్ లాంచ్‌లో నితిన్ భావోద్వేగ ప్రసంగం పాక్ సిరీస్‌పై సినీ కార్మిక సంఘం అల్టిమేటం: ఆ సిరీస్ ఆపకపోతే నెట్‌ఫ్లిక్స్ షూటింగ్‌లు బంద్ చేస్తామని హెచ్చరిక 14వ జేడీసీసీ సమావేశంలో రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిన భారత్, యూఏఈ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 2 వరకు కేరళ, మిజోరం, నాగాలాండ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఐఓఆర్ఏ మంత్రివర్గ సమావేశానికి ముందు శ్రీలంక జాతీయ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా నందమూరి బాలకృష్ణ: సభ్యుడిగా అల్లు అరవింద్ నియామకం సామాజిక న్యాయం కోసం ఢిల్లీకి మాజీ ఎంపీ తలారి రంగయ్య ‘బాల 369’ కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిఖిల్ సిద్ధార్థ ప్రశంసలు సిద్ధార్థ్ దత్తాతో హీరోయిన్, మాజీ ఎంపీ మిమి చక్రవర్తి వివాహం: వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు

ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో ఘన విజయం.. అత్యధిక ఓట్లతో రెండోసారి సెక్రటరీగా ముళ్లపూడి మోహన్

Select Suryaa Now
ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో ఘన విజయం.. అత్యధిక ఓట్లతో రెండోసారి సెక్రటరీగా ముళ్లపూడి మోహన్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో క్లబ్ అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు విజయం సాధించగా, సెక్రటరీ పదవికి పోటీ చేసిన ముళ్లపూడి మోహన్ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మొత్తం ఎన్నికల్లో మరెవరికీ రానన్ని ఓట్లతో ఏకంగా 1013 ఓట్లను సాధించి ఆయన రికార్డు సృష్టించారు. గతంలో తెలంగాణ టీటీడీ ఎల్ఏసి సభ్యుడిగా, ఎఫ్ఎన్‌సీసీ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ముళ్లపూడి మోహన్, గతంలో స్పోర్ట్స్ మరియు కల్చరల్ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించి సంస్థకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఈసారి కూడా ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించడం పట్ల సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో ముళ్లపూడి మోహన్‌తో పాటు పలువురు కీలక నాయకులు వివిధ స్థానాలకు ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా సదాశివరెడ్డి, ట్రెజరర్‌గా శైలజ, జాయింట్ సెక్రటరీగా ఎస్.ఎన్. రెడ్డి విజయం సాధించారు. అలాగే కమిటీ సభ్యులుగా ఏడిద రాజా, కృష్ణంరాజు, శ్రీనివాసరాజు, కిషోర్, కాజా సూర్యనారాయణ, మురళీమోహన్ రావు, భాస్కర్ నాయుడు, బాలరాజు, నాగసుష్మ గెలుపొందారు. కాగా కె.ఎస్. రామారావు ప్యానెల్ నుంచి ముళ్లపూడి మోహన్ ఒక్కరే సెక్రటరీగా విజయం సాధించడం విశేషంగా నిలిచింది. ఈ ఎన్నికల ఫలితాలతో ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌కు నూతన కార్యవర్గం కొలువుదీరింది.

దక్షిణ భారతదేశంలోనే కాకుండా యావత్ భారతదేశ స్థాయిలో ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌ను మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లడంలో ముళ్లపూడి మోహన్ అనుభవం ఎంతగానో దోహదపడుతుందని సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన హయాంలో జరిగిన సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను క్లబ్ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు. నూతన కార్యవర్గం ఎన్నికైం తర్వాత క్లబ్ అభివృద్ధికి మరిన్ని మెరుగైన వసతులు, కార్యక్రమాలు చేపడతామని విజేతలు తెలిపారు. ఈ ఎన్నికల విజయంతో ఫిలింనగర్ వర్గాల్లో పండుగ వాతావరణం నెలకొంది.