BREAKING
కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై దేశవ్యాప్తంగా మొదలైన తీవ్ర చర్చ కొందుర్గు పిఏసిఎస్ నూతన చైర్మన్ గా అనిత జితేందర్ రెడ్డి. యూకే ఎయిర్‌బేస్ వద్ద ఐదుగురి అరెస్ట్ ఉజ్జయినిలో తీవ్ర ఉద్రిక్తత కిసాన్ మోర్చా జిల్లా నూతన కమిటీ నియామకం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలను మరింత విజయవంతం చేయాలి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోండి: ప్రతిపక్షాలకు మంత్రి వీరాంజనేయులు తీవ్ర హెచ్చరిక బ్రిటన్ బడ్జెట్‌లో ఆర్థిక క్రమశిక్షణే కీలక ప్రాధాన్యం విజయవాడ దసరా ఉత్సవాలకు ఏఐ సాంకేతికతతో పటిష్ట నిఘా ఏర్పాట్లు: మంత్రి సత్యకుమార్ విద్య, ఉపాధికి ప్రభుత్వం ప్రాధాన్యం: భట్టి విక్రమార్క పింఛనుదారులకు గుడ్ న్యూస్‌ హోంగార్డుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి కీసరగుట్టలో వైభవంగా పల్లకి సేవ పరశురాంపల్లి తరిలింపునకు సానుకూల స్పందన విజయవాడ సీఐ అలీ మృతి కేసులో కీలక పురోగతి

సమాజోద్ధరణ, స్వాతంత్ర్యోద్యమ పిపాసులు

Select Suryaa Now
సమాజోద్ధరణ, స్వాతంత్ర్యోద్యమ పిపాసులు

సమాజోద్ధరణ, స్వాతంత్ర్యోద్యమ పిపాసులు
-గుర్రం జాషువా,భగత్‌సింగ్‌ ఆశయాలు నేటి తరానికి ఆదర్శం
-డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జయంతి వేడుకలు

పటాన్‌చెరు, సమాజ అభ్యున్నతి, కుల వివక్ష నిర్మూలన కోసం రచనలతో పోరాడిన గుర్రం జాషువా, అతి చిన్న వయసులోనే స్వాతంత్ర్యోద్యమంలోకి అడుగుపెట్టి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్‌సింగ్‌ ఆశయాలు నేటి తరానికి ఆదర్శనీయమని పటాన్‌చెరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. ప్రవీణ అన్నారు. కళాశాలలో తెలుగు, చరిత్ర విభాగాలు, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ జయంతి, గుర్రం జాషువా జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ భారత సమాజ అభ్యున్నతి, కుల వివక్ష నిర్మూలన కోసం గుర్రం జాషువా చేసిన సాహిత్య కృషి చిరస్మరణీయమన్నారు. "గబ్బిలం" 'ఫిరదౌసి" వంటి రచనలతో సమాజంలో చైతన్యం తీసుకువచ్చి, అభ్యుదయ భావాలకు బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు. అదేవిధంగా అతి చిన్న వయసులోనే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న భగత్‌సింగ్‌ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారని, దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమైన ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. భయమెరుగక ఉరికంబాన్ని సైతం ఎదుర్కొని దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన భగత్‌సింగ్‌ త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు.తెలుగు విభాగాధిపతి డాక్టర్ బేబీ రమణి, అధ్యాపకులు డాక్టర్ మంజుశ్రీ, డాక్టర్ బగ్గు నాయక్, డాక్టర్ దశమ్మ మాట్లాడుతూ గుర్రం జాషువా రచనలు అస్పృశ్యత, కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయని అన్నారు. ఆయన సాహిత్యం భారతీయుల ఆలోచనా విధానంలో మార్పునకు దోహదపడిందని పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ప్రొఫెసర్ ఆకుల వెంకటేశం,కరుణ కుమారి, డాక్టర్ పి.సుజాత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పూనం కుమారి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.