అనంతపురం ఎక్సైజ్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ
అనంతపురం బ్యూరో
అనంతపురం ఎక్సైజ్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ
మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన ఉన్నతాధికారులు
అనంతపురం: అనంతపురం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ను సోమవారం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎస్.కె.డి.వి. ప్రసాద్, జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి బి. రామమోహనరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా స్టేషన్‌లో కొనసాగుతున్న మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను అధికారులు స్వయంగా పరిశీలించారు. దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చిన ఆశావహులతో మాట్లాడి, వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణలో పారదర్శకత, సౌకర్యవంతమైన విధానం పాటించేలా సిబ్బందికి సూచనలు చేశారు.
మద్యం షాపుల దరఖాస్తుల ప్రక్రియపై ఆశావహులకు పూర్తి అవగాహన కల్పించేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. అర్హత కలిగిన వారు గరిష్ట సంఖ్యలో దరఖాస్తు చేసుకునేలా అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు.
తనిఖీ కార్యక్రమంలో అనంతపురం ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఈఎస్‌టీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జయనాథరెడ్డి, ఎస్‌ఐలు జయనరసింహ, జాకీర్ హుస్సేన్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.