BREAKING
మదనపల్లె పట్టణంలో రూ.27 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనారోగ్యంలోనూ అంకితభావం.. నటి డింపుల్ హయాతీపై త్రివిక్రమ్ ప్రశంసలు, ఆసక్తికర కామెంట్స్ వార్డు సమస్యలపై ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి పెద్ద శంకరంపేట లో భగత్ సింగ్ జయంతి వేడుకలు. సీఈ సి జ్ఞానేశ్ కుమార్​ను దేశద్రోహిగా ప్రకటించి అరెస్ట్ చేయాలి.... జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నంద్యాలలో బిగ్ బాస్...బిగ్ రక్తదానం శిబిరం సమాజోద్ధరణ, స్వాతంత్ర్యోద్యమ పిపాసులు పెద్దాపూర్‌లో అండర్ డ్రైనేజీ పనులకు భూమిపూజ ఆ ఒక్క మాట నన్ను కట్టిపడేసింది.. చెన్నై వేడుకలో రాజమౌళి భావోద్వేగ వ్యాఖ్యలు పేదలకు సంజీవని సీఎం సహాయనిధి -ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన రిచ్ మూవీ.. బస్తీ బాయ్ లవ్ స్టోరీగా రానున్న మోహిత్ పెడాడ చిత్రం సీఎం రాక ముందే పెండింగ్ పనులు ప్రారంభించాలి ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో ఘన విజయం.. అత్యధిక ఓట్లతో రెండోసారి సెక్రటరీగా ముళ్లపూడి మోహన్ నవంబర్ 21న హైదరాబాద్‌లో ప్రముఖ గాయని కేఎస్‌ చిత్ర చిత్రామృతం 3.0 మ్యూజికల్ కాన్సర్ట్ తుఫాన్ ప్రభావిత పంట నష్టాల ఎన్యుమరేషన్‌ను వేగంగా పూర్తి చేయాలి

మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి

Select Suryaa Now
మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి

 

*రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన అంధ క్రికెటర్లకు అండగా నిలవాలని విజ్ఞప్తి*

సూర్య, స్టేట్ బ్యూరో : 

 భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి సోమవారం ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. అజయ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో భారత అంధుల క్రికెట్ జట్టు మూడు సార్లు ప్రపంచకప్ ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ ను కలిసిన అజయ్.. రాష్ట్రంలో అంధుల క్రికెట్ అభివృద్ధితో పాటు గతంలో రాష్ట్రం తరపున జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు ప్రోత్సహకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో అంధ క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. అజయ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి లోకేష్.. తాను వ్యక్తిగతంగా చొరవ తీసుకుని అంధ క్రికెటర్లకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంధుల క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి జీ.రవీంద్రబాబు పాల్గొన్నారు.