BREAKING
అనారోగ్యంలోనూ అంకితభావం.. నటి డింపుల్ హయాతీపై త్రివిక్రమ్ ప్రశంసలు, ఆసక్తికర కామెంట్స్ వార్డు సమస్యలపై ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి పెద్ద శంకరంపేట లో భగత్ సింగ్ జయంతి వేడుకలు. సీఈ సి జ్ఞానేశ్ కుమార్​ను దేశద్రోహిగా ప్రకటించి అరెస్ట్ చేయాలి.... జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నంద్యాలలో బిగ్ బాస్...బిగ్ రక్తదానం శిబిరం సమాజోద్ధరణ, స్వాతంత్ర్యోద్యమ పిపాసులు పెద్దాపూర్‌లో అండర్ డ్రైనేజీ పనులకు భూమిపూజ ఆ ఒక్క మాట నన్ను కట్టిపడేసింది.. చెన్నై వేడుకలో రాజమౌళి భావోద్వేగ వ్యాఖ్యలు పేదలకు సంజీవని సీఎం సహాయనిధి -ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన రిచ్ మూవీ.. బస్తీ బాయ్ లవ్ స్టోరీగా రానున్న మోహిత్ పెడాడ చిత్రం సీఎం రాక ముందే పెండింగ్ పనులు ప్రారంభించాలి ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో ఘన విజయం.. అత్యధిక ఓట్లతో రెండోసారి సెక్రటరీగా ముళ్లపూడి మోహన్ నవంబర్ 21న హైదరాబాద్‌లో ప్రముఖ గాయని కేఎస్‌ చిత్ర చిత్రామృతం 3.0 మ్యూజికల్ కాన్సర్ట్ తుఫాన్ ప్రభావిత పంట నష్టాల ఎన్యుమరేషన్‌ను వేగంగా పూర్తి చేయాలి సినిమాలకు దూరంగా వెళ్లి వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన అరవింద్ స్వామి.. నటనను వీడి బిజినెస్ దిగ్గజంగా మారిన వైనం

నెల్లూరు సిటీలో అభివృద్ధి పరవళ్లు

Select Suryaa Now
నెల్లూరు సిటీలో అభివృద్ధి పరవళ్లు

నెల్లూరు సిటీలో అభివృద్ధి పరవళ్లు

ఒక్కరోజే రూ.7.59 కోట్ల పనులకు శ్రీకారం

రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలి : మంత్రి నారాయణ

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : 

నెల్లూరు నగరంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. నగరంలోని పలు డివిజన్లలో సోమవారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విస్తృతంగా పర్యటించి రూ.7.59 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, చేశారు. రహదారులు, సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్లు, గ్రీనరీ, పార్కులు, ఫౌంటైన్లతో పాటు క్రీడా సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.52వ డివిజన్‌ రంగనాయకులపేట పెద్దమసీదు సెంటర్‌లో రూ.39 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు మంత్రి భూమిపూజ చేశారు. 54వ డివిజన్‌ జనార్దన్‌రెడ్డి కాలనీలో రూ.1.70 కోట్లతో డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నగరంలోని ఎండ్‌టు ఎండ్‌ రోడ్లన్నింటినీ త్వరలో పూర్తి చేస్తామని, శంకుస్థాపన చేసిన పనులన్నీ రెండు నెలల్లో పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.
53వ డివిజన్‌ వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్‌ కింద రూ.4 కోట్లతో చేపట్టనున్న గ్రీనరీ, బ్యూటిఫికేషన్‌ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో షటిల్‌ కోర్టు, ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా అక్కడికక్కడే అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. గాంధీగిరిజన కాలనీలో రూ.1.50 కోట్లతో  నూతన పార్కు పనులను ప్రారంభించారు. ముత్తుకూరుగేట్‌ సెంటర్‌లో ఆనం వెంకటరెడ్డి విగ్రహం వద్ద ఫౌంటైన్‌ పనులకు శంకుస్థాపన చేశారు.

ఆలయానికి రూ.5 లక్షల విరాళం

జనార్దన్‌రెడ్డి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి మంత్రి నారాయణ రూ.5 లక్షల విరాళం అందజేశారు.
అడగకుండానే  విరాళం అందించినందుకు మంత్రికి  ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.

అక్టోబరు 2న స్టేడియం పనులకు భూమిపూజ

నెల్లూరు పాలిటెక్నిక్‌ కళాశాలలో అధునాతన స్టేడియం, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అక్టోబరు 2న భూమిపూజ చేసి పనులు ప్రారంభిస్తామని, మూడు విడతల్లో స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. అనంతరం వీఆర్‌ కాలేజీలో విద్యార్థులతో మంత్రి నారాయణ ముఖాముఖి నిర్వహించారు. అక్కడ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తాన్నారు.

అభివృద్ధికి రూ.240 కోట్లు

నెల్లూరు నగర అభివృద్ధికి 
మంత్రి నారాయణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అన్నారు. కార్పొరేషన్‌ అభివృద్ధికి రూ.240 కోట్లు మంజూరు చేయించారని, నగరాన్ని గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. నగరంలో తొలి స్టేడియం ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఇలాంటి అభివృద్ధిని గతంలో చూడలేదని పేర్కొన్నారు.డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో మంత్రి ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు మంత్రి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. పేదల అభ్యున్నతితో పాటు పేద పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారని చెప్పారు. అభివృద్ధి ద్వారా తనపై నమ్మకంతో అత్యధిక మెజారిటీ ఇచ్చిన నగరవాసుల రుణం తీర్చుకోవాలని మంత్రి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాల్లో మేయర్‌ దేవరకొండ సుజాత, ప్రిన్సిపాల్‌ రామారావు, అదనపు కమిషనర్‌ హిమబిందు, కార్పొరేషన్‌ ఎస్‌ఈ రహమత్ జానీ, ఈఈ చంద్రయ్య, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాళ్లపాక అనూరాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, ఆయా డివిజన్ల టీడీపీ నాయకులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.