నూనెపల్లె అండర్ రోడ్ బ్రిడ్జి నిర్మాణం ఆలస్యానికి వైసీపీ నేతలే ప్రధాన కారణం- సిపిఎం మాజీ నేత మస్తాన్ వలి
నంద్యాల అర్బన్:
నంద్యాలలోని నూనెపల్లె అండర్ రోడ్ బ్రిడ్జి నిర్మాణం ఆలస్యానికి గత ప్రభుత్వ ఎంపీ ఎమ్మెల్యేలు మరియు కౌన్సిలర్లు కాదని చెప్పగలరా అని సిపిఎం మాజీ నేత మస్తాన్ వలి అన్నారు.
ఒకవేళ చెప్పగలిగితే మీరు ఎందుకు ప్రారంభం చేస్తున్నట్లు ఆ రోజు అధికారులతో పూజా కార్యక్రమం చేయించారో మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి మీడియా ద్వారా తెలియజేయాలి. ఆ రోజు గొప్పగా చెప్పుకున్నారు నేడు వారే కావాలని ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజలు మోసం చేయడం కాదా, ఆనాడు మేము రైల్వే అండర్ పాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఉన్న చోట రాదు కనీసము గేటు నిర్మాణం చేయండని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. పాదాచార్యులు వ్యాపారస్తులు ఇతరులు వెళ్లడానికి అవకాశం ఉంటుందని చెప్పామన్నారు. పగలు పూట రైలులు ఎక్కువగా లేవు, రాత్రిపూట మాత్రమే అని కూడా చెప్పి నిరాహార దీక్ష చేసి అదీక్షకులకు ప్రారంభానికి టిడిపి సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి, సిపిఎం జిల్లా నాయకులు రమేష్ కుమార్, జమాయెతే ఇస్లాం నాయకుల సమ్మద్ మైనార్టీ ముస్లిం జాన్ యాక్షన్ కమిటీ అబులైజ్ కాంగ్రెస్ నాయకులు చింతలయ్య, ఎస్ వై డి ప్రసాద్ అనేక మంది ఆటో నాయకులు ప్రజాసంఘాల నాయకులు మద్దతు ఇచ్చారు. పనులు ప్రారంభం కాలేదు,ఎన్నికల్లో ఓటమి చెందారనీ, ఆయన పాటు అబద్ధ ప్రచారం చేసిన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోయారు. ఆనాడు వారి కౌన్సిలర్స్ మేమే చేస్తున్నామని డబ్బా కొట్టారు ఈ రోజు ఏమైంది ప్రజలకు చెప్పండి. ఇప్పుడున్న టిడిపి ప్రభుత్వం కూడా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేయలేదు. చేయడానికి అవకాశాలు లేవు. అపద్ధపు ప్రచారాలు నేటి ఎంపీ డాక్టర్ శబరి అలాగే మంత్రి ఫారుక్ తెలియజేస్తున్నారు. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే ఇంతవరకు ఎందుకు నిధులు కేటాయించలేదనీ మీడియా ద్వారా చెప్పండి. అలాగే మూలసాగరం ఫ్లై ఓవర్ బ్రిడ్జి రాదు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జి రాదు. ఆ ప్రతిపాదన ఇంకా కాలేదు. ఆ రిపోర్టులు కేంద్రానికి పంపలేదు. వాస్తవం కాదంటే ఎంపీ తెలియచేయాలి. అభివృద్ధి కమిటీ వారు మరియు సిపిఎం వారు ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వంపై వాస్తవాలు తెలుసుకునుటకు సమాచార హక్కు చట్టం వేయచ్చు కదా అన్నారు.అది ఎందుకు చేయడం లేదు. కావున ఇప్పటికైనా వాస్తవంగా అండర్ రోడ్ బ్రిడ్జి రాదు ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఉన్నచోట అందుకే మా డిమాండ్ రైల్వే గేటు పాదాచారులు వెళ్ళుటకు ఏర్పాటు చేయండి. మరియు ముఖ్యమైన విషయం నూనెపల్లె అభివృద్ధి కాకపోవడానికి నేటి వరకు పరిపాలించిన కౌన్సిలర్సు ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి టిడిపి ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి మంత్రి ఫరూఖ్ మరియు ఆనాటి నుండి నేటి వరకు ఉన్న కౌన్సిలర్సు కారణం కాదంటారా అన్నారు. అలాగే ఆనాడు రైల్వే స్టేషన్ ఏరియాలో నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ చిదంబరప్ప ఇందులో సెంటర్లో నిలబడితే కనబడేది నేడు నూనెపల్లి సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వరకు బ్రహ్మాండంగా అద్దాల మేడలు రంగురంగులతో విలసిల్లినవి మరియు నూనె పల్లె ఠాగూర్ ఎలిమెంటరీ స్కూల్ వెనక గడ్డివాములన్ని అద్దాలమేడలతో నిర్మించుకొని ఎన్జీవో కాలనీలో కలిసిపోయయన్నారు. ఒక్క గడ్డివాం కనపడదు. అలాగే హరిజన పేట వెనక ఉన్న పంట పొలాలు మాయమై బిల్డింగులు నిర్మించుకొని ఎన్జీవో కాలనీ బ్యాంక్ కోచింగ్ వరకు వెళ్లిపోయినవి అన్నారు. నూనెపల్లి దింపుడు కళ్ళము నుండి స్మశానం వరకు ఉన్న గడ్డివాములన్ని మాయమై బ్రహ్మాండంగా అటు ఇటు ఇల్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. మారుతి నగర్ లలితా నగర్ గా అభివృద్ధి చెందిన ది నీళ్ల ట్యాంకి నుండి ఏకలవ నగర్ వరకు ఎన్జీవో కాలనీ రస్తా వరకు గుడిసెలు ఉండేవి పోయి బిల్డింగులు వచ్చినవి నూనెపల్లెలో సాయి కృష్ణ డాక్టర్ ఒక్కడు అలాగే డాక్టర్ సుబ్రమణ్యం డాక్టర్ గెలువి సుబ్రమణ్యం ఉండేవారు నేడు ఇద్దరు చనిపోయిన బ్రహ్మాండంగా లేడీ డాక్టర్లు సర్జికల్ డాక్టర్లు వచ్చినారు. 5000 రూపాయలు సెంటు ఉన్న భూమి 50 లక్షలు పలుకుతున్నాయి. వెనుకబాట లేఖ అభివృద్ధి అన్నది కౌన్సిలర్లు చెప్పాలి. అసలు వెనుకబడి ఉన్నప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు. భయపడి ప్రశ్నించా లేదా అవినీతికి పాల్పడి ప్రశ్నించలేదా ప్రజలకు చెప్పండి గ్రామ పెద్దలు అనేవారు గ్రామ అభివృద్ధి చేయాలి. వారేం చేస్తున్నట్లు ఒంటెద్దు బండితోలే వారు పొలాలమ్మి కోట్ల రూపాయలు తెచ్చుకొని ఫైనాన్సులను నడుపుకుంటూ బ్రహ్మాండంగా జీవిస్తున్నారు. మీరు పొలాలు అమ్మడం వల్లనే కోయిలకుంట్ల రాస్తా ఆళ్లగడ్డ రాస్తా చా బోలు రోడ్డు లో ఉన్న పంట పొలాల రేట్లు పెరిగి అక్కడ మెడికల్ కాలేజీలో అన్ని అంగళ్లు డాక్టర్లు అన్ని వసతులు రావడం వల్ల ప్రజలు ఇటువైపు రావడం లేదు వసతులు లేకుంటే ఎంత దూరమైనా వెళ్తారు నూనెపల్లెలో గతంలో ఉన్న కౌన్సిలర్లు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేకపోయినా ము కావున మేము ఎన్నికల్లో పోటీ చేయము మాకు గాని మా తరఫున బలపరిచేవో వారికి ప్రజలు ఓట్లు వేయవద్దని బహిరంగంగా చెప్పండి నిజాయితీగా సాధించేవరకు పొట్టి శ్రీరాములు చేసినట్లు ఆ మరణ నిరాహార దీక్ష చేయండి అని తెలియజేస్తున్నాను. వాస్తవాలు నేను పుట్టి పెరిగిన ఊరు నూనెపల్లె కాబట్టి అందరి విషయాలు తెలుసు కాబట్టి తెలియజేస్తున్నాను ఇప్పటికైనా మించిపోలేదు సమాచార హక్కు చట్టం కింద రైల్వే జనరల్ మేనేజర్ అలాగే కలెక్టర్ కి సంబంధిత మంత్రులకు నూనెపల్లె అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వస్తుందా లేదా విద్యావంతులు తెలుసుకొని ప్రజలకు చెప్పండి మోసపూరిత వాగ్దానాలు చేయవద్దు ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే నూనెపల్లె మార్కెట్ యార్డ్ స్థలము టిడిపి క్యాబినెట్లో ఆమోదం పొందినది ఆ తర్వాత అసెంబ్లీలో ఆమోదం పొందినది టిడిపి ఎమ్మెల్యేలు మాట్లాడలేదు శాసనమండలిలో ఏ ఎమ్మెల్సీ మాట్లాడలేదు ఇప్పుడు గగ్గోలు పెడితే ప్రయోజనం ఏమిటి ఎన్నికల రాజకీయాలు వద్దు ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి అలాగే టేక్కేయాడ్ లో ఉన్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆఫీసు మొత్తము తీసుకుని వెళ్లి ఒక ప్రైవేటు పత్తి మిల్లులో పెట్టారు అక్కడి నుండి కొనుగోలు చేస్తున్నప్పుడు అమ్మకాలు జరుగుతున్నప్పుడు ఎందుకు రైతులు ప్రజల సంపదను దోచుకోవడానికి పెట్టారు అని మాట్లాడలేదు ఇప్పటికైనా మార్కెట్ యార్డులో అన్ని వాణిజ్య పంటలు రావాలి క్రయవిక్రయాలు జరగాలి అని చెప్తే కార్మికులకు పని లభిస్తుంది ట్రాన్స్ పోర్ట్ రంగానికి పని వస్తుంది హోటల్లో వారికి హోటల్లో జరుగుతాయి అందరికి శ్రేయస్కారంగా ఉంటుంది రైతు నాయకులు సాధించండి మొక్కుబడి కార్యక్రమాలు వద్దు పశువులకు గడ్డి కావాలంటే పంట పొలాలు అవి అన్ని రియల్ ఎస్టేట్ గా మారిపోయి బిల్డింగ్ లు వచ్చినవి కావున ప్రభుత్వం నుండి పసుదానాను తక్కువ రేట్ లో పశువులపై జీవించే వారికి సప్లై చేయమని డిమాండ్ చేయండి గ్రామ పెద్దలు వయసులో తప్ప అభివృద్ధిలో లేరు అనే విషయాన్ని గుర్తించుకోండి నేడు నూనెపల్లె వెనుకబాటుకు గత పాలకులు ప్రజాప్రతినిధులు కారకులు అన్నారు. దీక్షల వెనుక ఏ వర్గ ప్రయోజనాలు ఉన్నాయి తెలుసుకోలేనంత కాలము ప్రజలు మోసపోతూనే ఉంటారు. ఇప్పటికైనా మించిపోలేదు ఎన్నికల్లో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం చేస్తాము మాకు ఓటేయండి లేకుంటే రాజీనామా చేస్తాము అని ప్రచారం చేసిన దమ్మున్న వారు చేయండి. అప్పుడు మీకు కాలర్ పట్టుకుని అడగడానికి హక్కు ఉంటుంది నంద్యాల ఎమ్మెల్యేగా భూమా నాగిరెడ్డి పోటీ చేసినప్పుడు పదివేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చారు లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. ఆ హామీ మేరకు కృషి చేసి సాధించారు రోడ్ల విస్తరణ చేశారు ఆ ఇండ్లనే ఇప్పుడు మంత్రి గారు పంపిణీ చేశారు. కాదని మంత్రి చెప్పగలరా అని తెలియజేయాలని డిమాండ్ చేశారు.