BREAKING
అనారోగ్యంలోనూ అంకితభావం.. నటి డింపుల్ హయాతీపై త్రివిక్రమ్ ప్రశంసలు, ఆసక్తికర కామెంట్స్ వార్డు సమస్యలపై ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి పెద్ద శంకరంపేట లో భగత్ సింగ్ జయంతి వేడుకలు. సీఈ సి జ్ఞానేశ్ కుమార్​ను దేశద్రోహిగా ప్రకటించి అరెస్ట్ చేయాలి.... జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నంద్యాలలో బిగ్ బాస్...బిగ్ రక్తదానం శిబిరం సమాజోద్ధరణ, స్వాతంత్ర్యోద్యమ పిపాసులు పెద్దాపూర్‌లో అండర్ డ్రైనేజీ పనులకు భూమిపూజ ఆ ఒక్క మాట నన్ను కట్టిపడేసింది.. చెన్నై వేడుకలో రాజమౌళి భావోద్వేగ వ్యాఖ్యలు పేదలకు సంజీవని సీఎం సహాయనిధి -ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన రిచ్ మూవీ.. బస్తీ బాయ్ లవ్ స్టోరీగా రానున్న మోహిత్ పెడాడ చిత్రం సీఎం రాక ముందే పెండింగ్ పనులు ప్రారంభించాలి ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో ఘన విజయం.. అత్యధిక ఓట్లతో రెండోసారి సెక్రటరీగా ముళ్లపూడి మోహన్ నవంబర్ 21న హైదరాబాద్‌లో ప్రముఖ గాయని కేఎస్‌ చిత్ర చిత్రామృతం 3.0 మ్యూజికల్ కాన్సర్ట్ తుఫాన్ ప్రభావిత పంట నష్టాల ఎన్యుమరేషన్‌ను వేగంగా పూర్తి చేయాలి సినిమాలకు దూరంగా వెళ్లి వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన అరవింద్ స్వామి.. నటనను వీడి బిజినెస్ దిగ్గజంగా మారిన వైనం

స్థానిక ఎన్నికలకు అంతా సిద్ధం కావాలి.

Select Suryaa Now
స్థానిక ఎన్నికలకు అంతా సిద్ధం కావాలి.

స్థానిక ఎన్నికలకు అంతా సిద్ధం కావాలి.

స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా సన్నద్ధం కావాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రగిరి నియోజకవర్గంలోని యర్రావారిపాలెం మండలం, నెరబైలు గ్రామపంచాయతీలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో  సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. వార్డు మెంబర్‌ నుంచి సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వరకు అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపుతామని హర్షిత్‌రెడ్డి తెలిపారు. ప్రతి చోటా గెలుపు అవకాశాలున్న బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి.. వారి విజయానికి పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 70 శాతం వరకు స్థానాల్లో విజయం సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు.

*ప్రజల పక్షాన నిలవాలి**

ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు మరింత చేరువ కావాలని హర్షిత్‌రెడ్డి సూచించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి.. వాటి పరిష్కారం కోసం అధికారులను నిలదీయాలని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడమే కాకుండా.. పరిష్కారం లభించే వరకు అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు చురుగ్గా పనిచేస్తే ప్రజా మద్దతు మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు.

 **బెదిరింపులకు భయపడొద్దు**

ఎన్నికల సమయంలో వచ్చే బెదిరింపులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని హర్షిత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘మీకు చెవిరెడ్డి కుటుంబం అండగా ఉంది.. ఈ విషయాన్ని మరవొద్దు’’ అని భరోసా ఇచ్చారు. ప్రతి గ్రామంలో బలమైన అభ్యర్థులను నిలబెట్టి.. పార్టీ శ్రేణులంతా ఒక్కతాటిపైకి వచ్చి పనిచేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ప్రజలు మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని హర్షిత్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి ఎన్నికల పోరుకు సిద్ధం కావాలని సూచించారు. సమావేశంలో పంచాయతీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పార్టీలో వివిధ పదవులు పొందిన నాయకులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  చెంగల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి ,దేవేంద్ర, సుధాకర్ రెడ్డి, జయంత్, మస్తాన్, ఉమర్ బాషా, సుభాన్, హనీఫ్, అబ్దుల్ రెహమాన్, రాజమ్మ, సుభాషిణి, పద్మావతి, రామచంద్ర రెడ్డి,వెంకట సిద్దులు, మహేశ్వర్ రెడ్డి, శంకర్ రెడ్డి, రామచంద్ర రెడ్డి ,వెంకట ముని నాయుడు, శ్రీను, సునీల్, బోడేవాండ్ల పల్లి గ్రామ అధ్యక్షుడు రవి, యర్రావారి పాలెం గ్రామ కమిటీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, బబ్లూ, గంగిరెడ్డి, రమేష్, బాలాజీ, నాగులేష్, శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.