ట్రాన్స్‌జెండర్లకు ప్రశంస పత్రాలు అందజేసిన ఎస్పీ
సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల జిల్లాలో మూడు రోజుల పాటు నిర్వహించిన గణేష్ నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీస్ శాఖకు సహకరిస్తూ విశేష సేవలు అందించిన ట్రాన్స్‌జెండర్లు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, వాల్మీకి ఆవాస్ విద్యార్థులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అభినందించారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిమజ్జన బందోబస్తులో పాల్గొన్న 107 మందికి ప్రశంస పత్రాలను అందజేసి వారి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి చేతన్ నితిన్, ఇన్స్పెక్టర్ లు కరుణాకర్, ఆరిఫ్ అలీ ఖాన్,వేణు,ఎస్.ఐ లు కుమారస్వామి, మహేష్, సుప్రియా పాల్గొన్నారు.