భగత్ సింగ్ జయంతి వేడుకలు
సూర్య-నవీపేట్,నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో మహనీయుడు, స్వతంత్ర సమరయోధుడు షహిద్ భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలను వివేకానంద యూత్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధ్యక్షులు సాయితేజ మాట్లాడుతూ. భగత్ సింగ్ చదువుతున్న రోజులలో జూలియన్ వాలాబాగ్ దుర్ఘటనతో చలించిపోయారని అన్నారు. దేశ స్వతంత్రం కోసం 23 సంవత్సరాలకే ప్రాణత్యాగం చేసి ఇంక్వీలాబ్ జిందాబాద్ నినాదాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారని పేర్కొన్నారు. భగత్ సింగ్ ఆశయాలు ధైర్యము అన్యాయాన్ని ప్రశ్నించే సాహసం నేటి యువతకు ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవీన్ రాజ్, భానుగౌడ్, భునాది ప్రవీణ్, గంగాధర్, వినీత్ వార్డు సభ్యులు భునాది నవీన్, ప్రమోద్ పాల్గొన్నారు.