BREAKING
మదనపల్లె పట్టణంలో రూ.27 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనారోగ్యంలోనూ అంకితభావం.. నటి డింపుల్ హయాతీపై త్రివిక్రమ్ ప్రశంసలు, ఆసక్తికర కామెంట్స్ వార్డు సమస్యలపై ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి పెద్ద శంకరంపేట లో భగత్ సింగ్ జయంతి వేడుకలు. సీఈ సి జ్ఞానేశ్ కుమార్​ను దేశద్రోహిగా ప్రకటించి అరెస్ట్ చేయాలి.... జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నంద్యాలలో బిగ్ బాస్...బిగ్ రక్తదానం శిబిరం సమాజోద్ధరణ, స్వాతంత్ర్యోద్యమ పిపాసులు పెద్దాపూర్‌లో అండర్ డ్రైనేజీ పనులకు భూమిపూజ ఆ ఒక్క మాట నన్ను కట్టిపడేసింది.. చెన్నై వేడుకలో రాజమౌళి భావోద్వేగ వ్యాఖ్యలు పేదలకు సంజీవని సీఎం సహాయనిధి -ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన రిచ్ మూవీ.. బస్తీ బాయ్ లవ్ స్టోరీగా రానున్న మోహిత్ పెడాడ చిత్రం సీఎం రాక ముందే పెండింగ్ పనులు ప్రారంభించాలి ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో ఘన విజయం.. అత్యధిక ఓట్లతో రెండోసారి సెక్రటరీగా ముళ్లపూడి మోహన్ నవంబర్ 21న హైదరాబాద్‌లో ప్రముఖ గాయని కేఎస్‌ చిత్ర చిత్రామృతం 3.0 మ్యూజికల్ కాన్సర్ట్ తుఫాన్ ప్రభావిత పంట నష్టాల ఎన్యుమరేషన్‌ను వేగంగా పూర్తి చేయాలి

నెత్తురు మరిగే నిప్పుల కణం.షాహిద్ భగత్ సింగ్-

Select Suryaa Now
నెత్తురు మరిగే నిప్పుల కణం.షాహిద్ భగత్ సింగ్-

-సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి శ్రీను నాయక్..

నెత్తురు మరిగే నిప్పుల కణం షాహిద్  భగత్ సింగ్ అని షాద్ నగర్ పట్టణ సిపిఎం పార్టీ అధ్యక్షుడు శీను నాయక్ అన్నారు. భగత్ సింగ్   119 వ జయంతిని పురస్కరించుకొని  సిపిఎం పార్టీ షాద్ నగర్   కమిటీ ఆధ్వర్యంలో  పట్టణం లోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ని  భగత్ సింగ్ విగ్రహానికి  పూలమాలవేసి  నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి శ్రీను నాయక్  మాట్లాడుతూ దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం అతి చిన్న వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన వీర విప్లవ యువ కిశోరుడు అని కొనియాడారు నిరాశతో ఉన్న యువతరానికి భగత్ సింగ్ పోరాటం ఒక ఉత్తేజ కరం అన్నారు. రవి ఆస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన విప్లవ యోధుడని తెలిపారు. భగత్ సింగ్ చిన్నతనం నుంచి దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఒక వ్యక్తిని మరో ఒక వ్యక్తి దోచుకొని దోపిడీ లేని సమాజం కావాలని ఆ సమాజమే సోషలిజం అని నమ్మి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నినదించి. అంతరాలు లేని సభ్య సమాజం కోసం సోషలిజం కోసం పనిచేశాడని గుర్తు చేశారు. అందుకోసమే భగత్ సింగ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ అనే సంస్థను ఏర్పాటు చేసి పోరాటాలు కొనసాగించారని తెలిపారు. జైలు జీవితంలో భగత్ సింగ్ రాసిన పుస్తకం నేనెందుకు నాస్తికునయ్యాను అనే రచన  మనువాదులకు చెంపపెట్టు అన్నారు... భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిస్తామని వారు తెలిపారు.  ఈ కార్యక్రమంలో   .శ్రీకాంత్,అదిల్, రాంచరణ్, శివ గౌడ్ , సాయి గౌడ్, విష్ణు వర్ధన్, రాహుల్తదితరులు పాల్గొన్నారు.

-M. నరసింహ రెడ్డి, మేజర్ న్యూస్ ఫరూక్ నగర్….