BREAKING
జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే నల్ల బ్యాడ్జీలతో నిరసన.. పది రోజులవుతున్నా పరిష్కారం కానీ సమస్యలు. భగత్ సింగ్ జయంతి వేడుకలు ఏలినో ప్రభావాన్ని అధిగమించే ప్రత్యామ్నాయ పంటలపై రైతులు మొగ్గు చూపాలి. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలి తొలి చిత్రమే కావడంతో చాలా లక్కీగా ఫీలవుతున్నా: తత్వం హీరోయిన్ దష్విక ప్రత్యేక ఇంటర్వ్యూ మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు సిటీలో అభివృద్ధి పరవళ్లు నెత్తురు మరిగే నిప్పుల కణం.షాహిద్ భగత్ సింగ్- అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు అనకాపల్లి చిత్రం.. ప్రీ రిలీజ్ వేడుకలో సినీ ప్రముఖుల ప్రశంసలు ట్రాన్స్‌జెండర్లకు ప్రశంస పత్రాలు అందజేసిన ఎస్పీ అది జింక మాంసమే..... అనంతపురం ఎక్సైజ్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ పార్వతి తిరువొతు రికార్డు సృష్టి.. యాభై కోట్ల క్లబ్ లోకి ప్రథమ దృష్టియ కుట్టక్కర్ నూనెపల్లె అండర్ రోడ్ బ్రిడ్జి నిర్మాణం ఆలస్యానికి వైసీపీ నేతలే ప్రధాన కారణం- సిపిఎం మాజీ నేత మస్తాన్ వలి

దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి-డిసేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మస్తాన్ వలి

Select Suryaa Now
దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి-డిసేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మస్తాన్ వలి

 

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో  దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్(స్వాభిమాన్ )
ఏర్పాటు చేయాలని డిసేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ (DRWA/AP) వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మస్తాన్ వలి డిమాండ్ చేశారు. కాకినాడ, తూర్పుగోదావరి,అనంతపురం, మరియు అనేక జిల్లాలలో త్రివ్యాంగులకు ప్రతి నెల మూడవ శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ ( స్వాభిమాన్ ) కార్యక్రమం ఏర్పాటు చేసి దివ్యాంగుల సమస్యలను వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమస్యలను పరిష్కరిస్తున్నారని అదేవిధంగా నంద్యాల జిల్లాలో కూడా దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించాలని దీనివల్ల  నంద్యాల జిల్లా వ్యాప్తంగా దూర ప్రాంతాల నుండి దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకోవడానికి వీలుంటుందని అలాగే నంద్యాల జిల్లాలో  దివ్యాంగుల అసిస్టెంట్ డైరెక్టర్ (AD)కార్యాలయాలు ఉండాలని, దీనివలన దివ్యాంగులకు సుదూర ప్రాంతాల ప్రయాణం చేయకుండా సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. దివ్యాంగులకు సంబంధించి  ఏ సమస్య వచ్చినా  వెంటనే పరిష్కారం అవుతాయని ప్రస్తుతం ఉమ్మడి జిల్లా ఎడి కార్యాలయము 72 కిలోమీటర్లు దూరంలో ఉందని దివ్యాంగులు అక్కడికి వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమస్యను ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గారికి మెమరాండం అందించారు.
ఈ కార్యక్రమంలో డిసేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, సభ్యులు హుస్సేన్ వలి, వెంకటసుబ్బయ్య మరియు సాక్ష్యం సేవా కేంద్ర ప్రముక్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు