BREAKING
జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే నల్ల బ్యాడ్జీలతో నిరసన.. పది రోజులవుతున్నా పరిష్కారం కానీ సమస్యలు. భగత్ సింగ్ జయంతి వేడుకలు ఏలినో ప్రభావాన్ని అధిగమించే ప్రత్యామ్నాయ పంటలపై రైతులు మొగ్గు చూపాలి. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలి తొలి చిత్రమే కావడంతో చాలా లక్కీగా ఫీలవుతున్నా: తత్వం హీరోయిన్ దష్విక ప్రత్యేక ఇంటర్వ్యూ మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు సిటీలో అభివృద్ధి పరవళ్లు నెత్తురు మరిగే నిప్పుల కణం.షాహిద్ భగత్ సింగ్- అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు అనకాపల్లి చిత్రం.. ప్రీ రిలీజ్ వేడుకలో సినీ ప్రముఖుల ప్రశంసలు ట్రాన్స్‌జెండర్లకు ప్రశంస పత్రాలు అందజేసిన ఎస్పీ అది జింక మాంసమే..... అనంతపురం ఎక్సైజ్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ పార్వతి తిరువొతు రికార్డు సృష్టి.. యాభై కోట్ల క్లబ్ లోకి ప్రథమ దృష్టియ కుట్టక్కర్ నూనెపల్లె అండర్ రోడ్ బ్రిడ్జి నిర్మాణం ఆలస్యానికి వైసీపీ నేతలే ప్రధాన కారణం- సిపిఎం మాజీ నేత మస్తాన్ వలి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్ ఆనంద్

Select Suryaa Now
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్ ఆనంద్

అనంతపురం బ్యూరో

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్ ఆనంద్

అనంతపురం, సెప్టెంబర్ 28: 

ప్రజా సమస్యలను వేగంగా, పారదర్శకంగా, నిబంధనల మేరకు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్‌లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

అర్జీలను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా భూ సమస్యలు, రీసర్వే అనంతరం సరిహద్దు వివాదాలు, రికార్డుల్లో తప్పులు, విస్తీర్ణ వ్యత్యాసాలపై వచ్చే ఫిర్యాదులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని సూచించారు. 1100 టోల్‌ఫ్రీ సేవ ద్వారా వచ్చే ఫిర్యాదులపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

నేటి పీజీఆర్‌ఎస్‌లో జిల్లా వ్యాప్తంగా 497 అర్జీలు అందగా, వీటిలో 255 రెవెన్యూ క్లినిక్‌కు, 252 ఇతర సమస్యలకు సంబంధించినవిగా అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్, రెవెన్యూ అధికారి ఏ. మాలోల, ఇతర అధికారులు పాల్గొన్నారు.