ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 19 అర్జీలు --- కమిషనర్
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 19 అర్జీలు --- కమిషనర్
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.
కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ ప్రజలనుంచి అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి సంబంధించిన విభాగాల అధికారుల ద్వారా శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
నగరవ్యాప్తంగా రోడ్ల ఆక్రమణలతో పెద్ద సంఖ్యలో టౌన్ ప్లానింగ్ విభాగానికి ఫిర్యాదులు అందుకుంటున్నామని, నిర్దేశించిన రోడ్డు మార్జిన్ లోపునే వీధి వ్యాపారాలు చేసుకునేవారు విక్రయాలు జరుపుకోవాలని కమిషనర్ సూచించారు. ట్రాఫిక్ అంతరాయాలకు ప్రధాన కారణంగా ఉన్న రోడ్డు ఆక్రమణలను గుర్తించి డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయాలు తీసుకుని తప్పనిసరిగా తొలగించి వేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జరగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సమగ్ర ఓటర్ జాబితాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ప్రదర్శించి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశామని కమిషనర్ తెలిపారు.
నూతనంగా ఏర్పాటు చేసిన 72 డివిజన్లకు గాను 489 పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేసి అన్ని వసతులను కల్పించనున్నామని, పోలింగ్ స్టేషన్ల వివరాలను రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారని కమిషనర్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో సహకరించేలా అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలను నిర్వహించి సలహాలు సూచనలు తీసుకుంటున్నామని తెలిపారు.
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని ఓటర్లందరూ సాధారణ ఎన్నికలలో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ఆకాంక్షించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విభాగాల వారీగా టిడ్కో హౌసింగ్ 09, టౌన్ ప్లానింగ్ 05, రెవెన్యూ 01, ఇంజనీరింగ్ 03, అకౌంట్ సెక్షన్ 01, మొత్తం 19 వినతులను మేయర్, కమిషనర్ లు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ లు శేషగిరిరావు, అనిల్ కుమార్, మేనేజర్ రాజేశ్వరి అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.