BREAKING
జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే నల్ల బ్యాడ్జీలతో నిరసన.. పది రోజులవుతున్నా పరిష్కారం కానీ సమస్యలు. భగత్ సింగ్ జయంతి వేడుకలు ఏలినో ప్రభావాన్ని అధిగమించే ప్రత్యామ్నాయ పంటలపై రైతులు మొగ్గు చూపాలి. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలి తొలి చిత్రమే కావడంతో చాలా లక్కీగా ఫీలవుతున్నా: తత్వం హీరోయిన్ దష్విక ప్రత్యేక ఇంటర్వ్యూ మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు సిటీలో అభివృద్ధి పరవళ్లు నెత్తురు మరిగే నిప్పుల కణం.షాహిద్ భగత్ సింగ్- అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు అనకాపల్లి చిత్రం.. ప్రీ రిలీజ్ వేడుకలో సినీ ప్రముఖుల ప్రశంసలు ట్రాన్స్‌జెండర్లకు ప్రశంస పత్రాలు అందజేసిన ఎస్పీ అది జింక మాంసమే..... అనంతపురం ఎక్సైజ్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ పార్వతి తిరువొతు రికార్డు సృష్టి.. యాభై కోట్ల క్లబ్ లోకి ప్రథమ దృష్టియ కుట్టక్కర్ నూనెపల్లె అండర్ రోడ్ బ్రిడ్జి నిర్మాణం ఆలస్యానికి వైసీపీ నేతలే ప్రధాన కారణం- సిపిఎం మాజీ నేత మస్తాన్ వలి

ఆక్వా రైతులకు విద్యుత్‌ భరోసా

Select Suryaa Now
ఆక్వా రైతులకు విద్యుత్‌ భరోసా

రూ.55 కోట్లతో 220/33 కేవీ సబ్‌స్టేషన్‌ ప్రారంభం

యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే సబ్సిడీపై సరఫరా

ఆక్వా విద్యుత్‌ రాయితీకి రూ.1,200 కోట్లు ఖర్చు

రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్‌స్టేషన్ల నిర్మాణం

ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్వా విద్యుత్‌ సరఫరా నిలిపేది లేదు

 - మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

సూర్య, స్టేట్  బ్యూరో : 

పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. గోపవరంలో రూ.55 కోట్లతో నిర్మించిన 220/33 కేవీ సబ్‌స్టేషన్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రఘురామకృష్ణంరాజు, కామినేని శ్రీనివాస్‌, జయమంగళ వెంకటరమణ పాల్గొన్నారు.

జిల్లాలో ఆక్వా సాగు విస్తరిస్తున్న నేపథ్యంలో రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ అందించాలనే ఉద్దేశంతో గోపవరం సబ్‌స్టేషన్‌ను నిర్మించినట్లు మంత్రి తెలిపారు. ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్‌ను కేవలం రూ.1.50కే సబ్సిడీపై కూటమి ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఆక్వా రైతులకు రాయితీపై విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ విద్యుత్‌ రాయితీ అందిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు రూ.6 వేల కోట్లతో సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఒక్క సబ్‌స్టేషన్‌ కూడా నిర్మించలేదని విమర్శించారు. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో విద్యుత్‌ శాఖను 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. అప్పట్లో ప్రతి ఆరు నెలలకు ఏదో ఒక రూపంలో విద్యుత్‌ చార్జీలు పెంచారని అన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా విద్యుత్‌ చార్జీలు పెంచకుండా ట్రూడ్‌డౌన్‌ చేశామని మంత్రి తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా పెరిగినప్పటికీ, డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తిని పెంచామని చెప్పారు. పీక్‌ అవర్స్‌లో అవసరమైతే తక్కువ ధరకే బహిరంగ మార్కెట్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

ఆక్వా రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిరంతరాయ విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్వా రైతులకు విద్యుత్‌ సరఫరా నిలిపే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు.