BREAKING
జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే నల్ల బ్యాడ్జీలతో నిరసన.. పది రోజులవుతున్నా పరిష్కారం కానీ సమస్యలు. భగత్ సింగ్ జయంతి వేడుకలు ఏలినో ప్రభావాన్ని అధిగమించే ప్రత్యామ్నాయ పంటలపై రైతులు మొగ్గు చూపాలి. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలి తొలి చిత్రమే కావడంతో చాలా లక్కీగా ఫీలవుతున్నా: తత్వం హీరోయిన్ దష్విక ప్రత్యేక ఇంటర్వ్యూ మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు సిటీలో అభివృద్ధి పరవళ్లు నెత్తురు మరిగే నిప్పుల కణం.షాహిద్ భగత్ సింగ్- అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు అనకాపల్లి చిత్రం.. ప్రీ రిలీజ్ వేడుకలో సినీ ప్రముఖుల ప్రశంసలు ట్రాన్స్‌జెండర్లకు ప్రశంస పత్రాలు అందజేసిన ఎస్పీ అది జింక మాంసమే..... అనంతపురం ఎక్సైజ్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ పార్వతి తిరువొతు రికార్డు సృష్టి.. యాభై కోట్ల క్లబ్ లోకి ప్రథమ దృష్టియ కుట్టక్కర్ నూనెపల్లె అండర్ రోడ్ బ్రిడ్జి నిర్మాణం ఆలస్యానికి వైసీపీ నేతలే ప్రధాన కారణం- సిపిఎం మాజీ నేత మస్తాన్ వలి

విద్యార్థులు, యువత భాగస్వామ్యంతో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలి*

Select Suryaa Now
విద్యార్థులు, యువత భాగస్వామ్యంతో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలి*

 

*విద్యార్థులు, యువత భాగస్వామ్యంతో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలి*

*మారథాన్‌ విజేతలకు నగదు బహుమతుల చెక్కులు అందజేసిన కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి*

కర్నూలు, సెప్టెంబర్ 28: ఎయిడ్స్‌ వ్యాధి నివారణ, నియంత్రణపై విద్యార్థులు, యువతతో పాటు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యం, క్రమశిక్షణ, వ్యాయామం పట్ల చైతన్యం పెంచాలని   జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం  ఎయిడ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన  మారథాన్‌లో పాల్గొని విజేతలుగా ఎంపికైన విద్యార్థులకు కలెక్టర్ సునయన ఆడిటోరియంలో  నగదు బహుమతులు అందచేశారు. 

 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సుమారు 87 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మారథాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. ఎయిడ్స్‌పై ఉన్న అపోహలను తొలగించడం, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన 5 కిలోమీటర్ల పరుగు పందెం పురుషుల విభాగంలో బషీర్‌ ప్రథమ బహుమతి, వెంకట భరత్‌ ద్వితీయ బహుమతి సాధించారు. మహిళల విభాగంలో వెంకటేశ్వరి ప్రథమ బహుమతి, రామలక్ష్మి ద్వితీయ బహుమతి సాధించారు. మారథాన్‌లో విజేతలుగా నిలిచిన వారికి జిల్లా కలెక్టర్  నగదు బహుమతులకు సంబంధించిన చెక్కులను అందజేసి అభినందించారు. పురుషులు, మహిళల విభాగాల్లో ప్రథమ బహుమతిగా రూ.10,000 చొప్పున, మహిళల విభాగంలో ద్వితీయ బహుమతిగా రూ.7,000 నగదు బహుమతిని అందజేశారు. ఎయిడ్స్‌ వ్యాధి నివారణ, నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతను భాగస్వాములను చేస్తూ ఎయిడ్స్‌పై అవగాహన, ఆరోగ్య పరిరక్షణ, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై మరిన్ని కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని  కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, మరియు ఎయిడ్స్ అధికారి డాక్టర్ భాస్కర్, డి.ఎస్.డి.ఓ భూపతిరావు తదితరులు పాల్గొన్నారు.