ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ఉండకూడదు*
*ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ఉండకూడదు*
*అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాలు అందించాలి*
*పీజీఆర్ఎస్‌లో ‘రీ-ఓపెన్’, ‘ఇంప్రాపర్ రెడ్రెసల్’ కేసులు పూర్తిగా తగ్గాలి*
*జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి*
కర్నూలు, సెప్టెంబర్ 28: ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి అర్జీని అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్వీకరించారు.
ప్రతి ఫిర్యాదుపై అధికారులు సత్వరంగా స్పందించి,పరిష్కరించాలని, అర్జీదారులకు అందించే ఎండార్స్‌మెంట్‌లు స్పష్టంగా, పూర్తి వివరాలతో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. పరిష్కరించడం సాధ్యం కాని సమస్యల విషయంలో అందుకు గల కారణాలను అర్జీదారులకు స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో నమోదవుతున్న ‘రీ-ఓపెన్’, ‘ఇంప్రాపర్ రెడ్రెసల్’ కేసులను పూర్తిగా తగ్గించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఒకసారి పరిష్కరించిన అర్జీ మళ్లీ రీ-ఓపెన్ అయ్యే పరిస్థితి రాకుండా, సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందించాలని సూచించారు. నిబంధనల పరిధిలో సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అర్జీలను గడువు లోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనురాధ, శివ ప్రసాద్ రెడ్డి, రామ సుబ్బయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.