వైఎస్సార్సీపీ యువజన విభాగం నేత సద్దలతో కాటసాని ఆత్మీయ కలయిక
నంద్యాల అర్బన్: సూరజ్ ఎపిటోమ్ (SURAJ EPITOME) అపార్ట్‌మెంట్‌లో నూతన గృహప్రవేశం పూర్తి చేసుకున్న వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకుడు, గగ్గటూరు మాజీ సర్పంచ్, 'హెల్పింగ్ హాండ్స్ సొసైటీ' అధినేత సద్దల చంద్రశేఖర్ రెడ్డి-పద్మావతి దంపతులను వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్‌భూపాల్ రెడ్డి ఆత్మీయంగా కలిసి ఆశీర్వదించారు.
పార్టీ యువజన విభాగంలో చురుగ్గా వ్యవహరిస్తూ, సామాజిక సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందిన సద్దల చంద్రశేఖర్ రెడ్డి నూతన గృహప్రవేశం చేసిన సందర్భంగా కాటసాని రామ్‌భూపాల్ రెడ్డి స్వయంగా వారి నివాసానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రశేఖర్ రెడ్డి-పద్మావతి దంపతులతో పాటు వారి కుమారుడు సద్దల అనీష్ రెడ్డి, కుటుంబ సభ్యులు లోకేష్ రెడ్డి, అఖిల, భాగ్యమ్మలను అభినందిస్తూ, వారి కుటుంబం సకల శుభాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ, ఇతర రాజకీయ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నేత సూర్యనారాయణ రెడ్డి, ఎంఐఎం పార్టీ నాయకుడు నారాయణ రెడ్డి, వైసీపీ నాయకులు సుమంత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మదన్మోహన్ రెడ్డి, శివారెడ్డి, మహేష్ రెడ్డి, గురువారెడ్డి తదితరులు హాజరై సద్దల చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేశారు.