BREAKING
మనోవికాస కథలు పుస్తకావిష్కరణ మేము పేదలకు పట్టాభిషేకం చేస్తుంటే వాళ్లు రక్తాభిషేకం అంటున్నారు ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించాలి -- సిపిఎం డిమాండ్ రెండు పాఠశాలలో మినహా అన్ని పాఠశాలలో ఎస్ఎంసి ఎన్నికలు పూర్తి - ఎంఈఓ భార్య భర్తలు ఇద్దరు ఓటు వేస్తామని భీష్మించుకోవడంతో ఎన్నిక వాయిదా తిరుపతి మేయర్ పదవి ఎస్సీ ఎస్టీ లకు కేటాయించాలి విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలి ఎంఈఓ సునీత రావుపల్లి అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార ప్రదర్శన దత్తత తీసుకోవటం మానవత్వం జిల్లా కలెక్టర్ విద్యార్థులకు మంచి భోజనం అందించాలి మోదీ సేవా ప్రస్థానం స్ఫూర్తిదాయకం కొప్పలవెలమ డైరెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎస్ ఎం సి చైర్మన్ లు ముక్కామల ఉన్నత పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా కొత్తపల్లి హేమలత ఏకగ్రీవ ఎన్నిక డయాజియో ఇండియా, భారతదేశంలోని అతిపెద్ద బ్రాండ్‌లలో ఒకటైన మెక్‌డొవెల్స్ నెం.1ను కొత్త తరానికి అనుగుణంగా సరికొత్తగా ఆవిష్కరించింది. ఢిల్లీలో దళిత–ఆదివాసీ సమావేశంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

పింఛన్ల చెల్లింపులో గందరగోళం తగదు

Select Suryaa Now
పింఛన్ల చెల్లింపులో గందరగోళం తగదు

పింఛన్ల చెల్లింపులో గందరగోళం తగదు
- 2 భాగాలుగా చెల్లించే విధానాన్ని వెనక్కి తీసుకోవాలి
- పాత విధానంలోనే ఒకేసారి అందించాలి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గ  దివ్యాంగుల అధ్యక్షుడు చాగలేటి భాస్కర్

పులివెందుల మేజర్ న్యూస్:

ఎన్టీఆర్ భరోసా పింఛన్లను రెండు భాగాలుగా చెల్లించే విధానాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గ దివ్యాంగుల అధ్యక్షులు చాగలేటి భాస్కర్  డిమాండ్ చేశారు. పింఛన్ ప్రభుత్వం అందించే భిక్ష కాదని.. అది లబ్ధిదారుల సామాజిక భద్రత, ఆత్మగౌరవానికి సంబంధించిన హక్కు అని పేర్కొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ నెల 22న జారీ చేసిన మెమో ద్వారా ఎన్ఎస్ఏపీ కింద కేంద్ర ప్రభుత్వ వాటాను డీబీటీ ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేసి, మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ వాటాను నగదు రూపంలో ఇంటివద్ద అందించే విధానానికి అనుమతి ఇచ్చిందని తెలిపారు.
పింఛన్ మొత్తం తగ్గించడం లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. రెండు భాగాలుగా, రెండు పద్ధతుల్లో చెల్లించడం వల్ల వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఒంటరిగా జీవించే వృద్ధులు, వితంతువులు, తీవ్ర వైకల్యంతో దివ్యాంగులు గా ఉన్న లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లో జమయ్యే మొత్తాన్ని తెలుసుకోవడం, నగదు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర వాటాల పేరుతో పింఛన్ను విభజించి వేర్వేరు పద్ధతుల్లో చెల్లించడం వల్ల లబ్ధిదారులకు అదనపు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ప్రస్తుతం ఉన్న పింఛన్ మొత్తాన్ని ఒకేసారి, సరళంగా, పారదర్శకంగా లబ్ధిదారులకు అందించే పాత విధానాన్నే కొనసాగించాలని చాగలేటి భాస్కర్ డిమాండ్ చేశారు.