రావుపల్లి అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార ప్రదర్శన
అంగన్వాడీ వర్కర్ మర్రాపు సావిత్రికి ఘన సత్కారం
ఐసిడిఎస్ పి ఓ గొట్టాపు సుగుణ కుమారి,సూపర్వైజర్ రౌతు లక్ష్మీ
గరుగుబిల్లి, సెప్టెంబర్ 29, మేజర్ న్యూస్:గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పోషణ్ మా"(జాతీయ పోషణ మాసం) కార్యక్ర మంతో పాటు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల పరిధి లోని రావుపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ వర్కర్ మర్రాపు సావిత్రి ఆధ్వర్యంలో పౌష్టికాహార ప్రద ర్శన ఏర్పాటు చేశారు.అదే విధముగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం లో భాగంగా కొమరాడ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి గొట్టాపు సుగుణ కుమారి,గరుగుబిల్లి సెక్టార్ ఐ సి డి ఎస్ సూపర్వైజర్ రౌతు లక్ష్మీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో పలు కార్యక్ర మాలను నిర్వహిస్తున్నారు.ఈసంద ర్భంగా రావుపల్లి గ్రామంలోని అంగ న్వాడీ కేంద్రంలో అంగన్వాడీ వర్కర్ మర్రాపు సావిత్రిని అంగన్వాడీ కేంద్రం కోస్తున్న చిన్నారుల తల్లిదండ్రులతో పాటు లబ్ధిదారులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.అనంతరం జరిగిన సమావేశంలో కొమరాడ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి గొట్టాపు సుగుణకుమారి మాట్లాడుతూ పోషకాహార లోపాన్ని నిర్మూలించడం లో అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు ఆయాల పాత్ర ఎంతో కీలకమైనదని కొనియాడారు.నెల రోజుల ప్రజలకు పోషకాహారంపై అవగాహన కల్పించేం దుకు వారు చేసిన కృషి అభినందనీ యమన్నారు.ఉత్తమ సేవలకు గుర్తింపు
పోషణ్ మాస్ ఉత్సవాల్లో భాగంగా గడిచిన నెల రోజులుగా వైవిధ్యభరిత మైన కార్యక్రమాలు నిర్వహించి, విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అంగన్‌వాడీ కార్యకర్తలను అధికారులు మరియు ప్రజాప్రతినిధులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించడం జరుగు తుందన్నారు.పోషణ్ మాసో త్సవాల లో అంగన్‌వాడీ కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 9వ రాష్ట్రీయ పోషణ్ మాస్ (జాతీయ పోష కాహార మాసం - 2026) ఉత్సవాల్లో భాగంగా, క్షేత్రస్థాయిలో విశేష సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ తరఫున సన్మా నించడం జరుగుతుందన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశాన్ని 'సుపోషిత్ భారత్' (పోషకా హార లోపం లేని భారతదేశం)గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పోషణ్ అభియాన్ కొనసాగుతోందని పేర్కొ న్నారు.గరుగుబిల్లి సెక్టార్ సూపర్వైజర్ రౌతు లక్ష్మి మాట్లాడుతూ చిన్నారులు, గర్భిణు లు,బాలింతల ఆరోగ్యం కోసం శ్రమిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలే నిజమైన క్షేత్రస్థాయి యోధు లని పేర్కొన్నారు.సమాజంలో వారి సేవలు వెలకట్టలేనివని, అందుకే కేంద్ర ప్రభుత్వం 'సేవా సంకల్ప్ అభియాన్' ద్వారా తగిన గుర్తింపు ఇస్తోందని తెలిపారు.ఈకార్యక్రమంలో అంగన్వాడి వర్కర్ మర్రాపు సావిత్రి,అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న చిన్నారుల తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు.