BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

యూనియన్ బలోపేతానికి మరింత కృషి చేయాలి

Select Suryaa Now
యూనియన్ బలోపేతానికి మరింత కృషి చేయాలి


ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ శివ ప్రసాద్ పిలుపు 
విజయనగరం టౌన్, సెప్టెంబరు 30,మేజర్ న్యూస్:
జర్నలిస్టుల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నామని, అందువల్ల యూనియన్ ను మరింత బలోపేతం సభ్యులు కీలకపాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ పిఎస్ఎస్ వి ప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం ఒక ప్రైవేటు హోటల్ లో జరిగిన ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ, అనుబంధ కమిటీల పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో ఏపీయూడబ్ల్యూజే పటిష్టంగా ఉందని, దీనికోసం యూనియన్ నాయకులు చేస్తున్న కృషి మరువలేనిదని అన్నారు. ఇటీవల జరిగిన ఏపీయూడబ్ల్యూజే మహాసభ విజయవంతమైందని చెప్పారు. పాత్రికేయుల సమస్యలపై పోరాటం చేయడంలో విజయనగరం జిల్లా యూనిట్ మంచి గుర్తింపు పొందిందని తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి తద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. జిల్లా సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ మాట్లాడుతూ పాత్రికేయులకు, పాత్రికేయ కుటుంబాలకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తామని చెప్పారు.  ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా యూనిట్, అర్బన్ యూనిట్ సభ్యులతో పాటు అనుబంధ కమిటీల సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎలిశెట్టి సురేష్ కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా సంఘం గౌరవ అధ్యక్షుడు భరద్వాజ చక్రవర్తి, చిన్న, మధ్యతరహా పత్రికల గౌరవ అధ్యక్షుడు కేజే శర్మ, జర్నలిస్టుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు కుసుమంచి శ్రీనివాసరావు, అర్బన్ యూనిట్ గౌరవ అధ్యక్షుడు వైఎస్ పంతులు , రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంఎస్ ఎన్ రాజు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు టి రాధాకృష్ణ , యూనియన్ సీనియర్ నాయకులు పంచాది అప్పారావు, సముద్రాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.