ప్రతీ గ్రామం పరిశుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛ రథంతో వ్యర్థాలు సేకరణ "ఎంపిడిఓ "
గుర్ల,సెప్టెంబర్ 30,మేజర్ న్యూస్:ప్రతీ గ్రామం పరిశుభ్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ రథం ద్వారా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాలు సేకరించడం జరుగుతుందని ఎంపీడీవో రవికుమార్ తెలిపారు. బుధవారం చింతలపేట గ్రామంలో తడి చెత్త పొడి చెత్త విధానంపై గ్రామ పెద్దయిన పిల్ల అప్పలనాయుడు తో కలిసి గ్రామంలో అవగాహన చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తడి చెత్త బకెట్లో వేసి రోజు వస్తున్న క్లాస్ మిత్రులకు ఇవ్వాలన్నారు. అలాగే పొడి చెత్త అయిన అట్టలు ఇనుము, అల్యూమినియం గాజు సీసాలు వంటివి గ్రామాలకు వస్తున్న స్వచ్ఛ రదానికి ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో భాగంగా 580 కేజీలు పొడి చెత్తను సేకరించినట్లు తెలిపారు.ఇందులో85 కేజీలు పొడి చెత్త సేకరించిన భోగాపురం సామలమ్మకు సరుకులతో పాటు స్టీల్ బిందును అందజేశారు.55 కేజీలు చెత్త సేకరించిన ప్రతివాడ గౌరీ,36 కేజీలు చెత్త సేకరించిన పిల్లా సురేష్ కి స్టీల్ సింబల్ అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రవికుమార్ మాట్లాడుతూ గ్రామాలలో గ్రామ ప్రజలు సహకరించినట్లయితే తడి పొడి చెత్త సేకరణ ద్వారా.గ్రామాలన్నీ పరిశుభ్రతకు చిరునామాగా మారుతాయి అన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు భూములో కలిసిపోయి అనేక అనర్థాలకు దారితీస్తాయని. నీటి నిల్వలు భూములోకి ఇంకక పోవడంతో పాటు వ్యవసాయ భూముల కూడా ఈ వ్యర్థాలను విచ్చలవిడిగా వేయడం వలన పంటలు కూడా పండని పరిస్థితి ఏర్పడుతోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గ్రామాల్లో తడి పొడి చెత్త లకు శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామాల్లో గ్రీన్ అంబాసిడర్లను ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉన్న తడి పొడి చెత్త లను ఇళ్ల నుంచి సేకరించి వాటిని సంపద సృష్టి కేంద్రాలకు తరలించి సేంద్రీయ ఎరువులను తయారు చేసే విధంగా ఆయా పంచాయితీ అధికార సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు, తాజాగా ప్రభుత్వం స్వచ్ఛరథం ద్వారా గ్రామాల్లో తడి చెత్తను సేకరించాలన్నది లక్ష్యంగా పెట్టుకుందనీ తెలిపారు. కార్యక్రమంలో ఈవో పి ఆర్ డి గ్రామ పెద్దలు పాల్గొన్నారు.