BREAKING
కాలేజీనిసమర్ధవంతంగానిర్వహించినకరెస్పాండెంట్రాధాకృష్ణయ్య ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్ మండల స్థాయి కబడ్డీ పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల విజయదుందుభి! గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల హల్‌చల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బీపీఎం రంగంలో భారీ మార్పులు: ప్రపంచ ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్‌గా భారత్.. నాస్కామ్ వెల్లడి LT, HT విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు – పారదర్శకత, సరళత, వేగవంతమైన సేవలు ఆగస్టులో దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 7.5 శాతం తగ్గుదల: ఐఏటీఏ నివేదిక వెల్లడి పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాలి.. బదిలీపై వెళ్లిన ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి సన్మానం తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన ఉపాసులో వరల్డ్ హార్ట్ డే పై అవగాహన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సౌర విద్యుత్ ప్లాంట్‌కు భూమిపూజ చెరువులో శవమై తేలిన యువకుడు పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ప్రభుత్వం, పరిశ్రమల సమన్వయం: సీఐఐ హిమాచల్ ప్రదేశ్ సదస్సు 3కె హెల్త్ వాక్‌ను విజయవంతం చేయండి.. VC

కొత్తపల్లి సర్పంచ్ ఇంటిపై గుర్తుతెలియని దుండగుల రాళ్లదాడి

Select Suryaa Now
కొత్తపల్లి సర్పంచ్ ఇంటిపై గుర్తుతెలియని దుండగుల రాళ్లదాడి
పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి 
 పోలీసులకు ఫిర్యాదు చేసిన సర్పంచ్ భర్త నాగారం శ్రీశైలం 
 
 కోటపల్లి మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 30 ):కోటపల్లి మండల పరిధిలోని కొత్తపల్లి సర్పంచ్ నాగారం హేమలత శ్రీశైలం ఇంటిపై మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు రాళ్లతో దాడి చేయడం పిరికిపంద చర్య అని బిజెపి జిల్లా అధ్యక్షులు ఉప్పరి రమేష్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ విషయానికి సంబంధించిన దరఖాస్తును స్థానిక ఎస్సై కి ఇచ్చిన తర్వాత విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కొన్ని గ్రామాలలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులు గెలిచిన సర్పంచుల పై దాడి చేయడం పరిపాటిగా మారిందని అన్నారు. కోటపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ భర్త పై జరిగిన దాడి సంఘటన మరువకముందే ఈ రకమైన చర్యలకు పాల్పడడం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల బలహీనతకు నిదర్శనం అని అన్నారు. ఈ రకమైన సంఘటనలు జరిగినప్పుడు వారి పైన కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మళ్లీ మళ్లీ పునరావృతమైతున్నాయని తెలిపారు. ఈ రాళ్ల దాటి జరిగిన సమయంలో ఒకవేళ బయటికి వారు వచ్చి ఉంటే వారిని చంపేవారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఈ రకమైన రాజకీయం చేయడం అంటేనే మంచి రాజకీయ నాయకులు భయభ్రాంతుల కు గురి అయ్యే సమయం వచ్చిందని ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు కఠినమైన శిక్షలు పడే విధంగా పనిచేయాలన్నారు. లేకుంటే స్థానిక కలెక్టర్ కు, ఎస్ పి కి వినతి పత్రం సమర్పించి జిల్లావ్యాప్తంగా ధర్నాలకు దిగి ఇలాంటి దుండగులపై కఠినమైన సెక్షన్లతోపాటు, శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకొని, ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దిశా కమిటీ కోఆర్డినేటర్ వడ్ల నందు, మండల బిజెపి పార్టీ అధ్యక్షులు శివకుమార్, మాజీ ఎంపీటీసీ శ్రీకాంత్ రెడ్డి, నాగారం మల్లేశం, బుగ్గాపూర్ సర్పంచ్ మహేందర్ దొర బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 
రిపోర్టర్ మంగలి కృష్ణ.