BREAKING
విద్వేషా దూషణలతో కాలక్షేపం చేస్తూ పరిపాలనను గాలికి వదిలేశారు..మాజీ మంత్రి పువ్వాడ ఆరోపణ. అక్టోబర్ 2న థియేటర్లలోకి విభిన్న కథాంశంతో వస్తున్న టాలీవుడ్ మూవీ ఇంప్యూర్ టోరెంట్ ఫార్మాపై మోతీలాల్ ఓస్వాల్ కవరేజ్ ప్రారంభం: 'న్యూట్రల్' రేటింగ్ కేటాయింపు.. కాలేజీనిసమర్ధవంతంగానిర్వహించినకరెస్పాండెంట్రాధాకృష్ణయ్య ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్ మండల స్థాయి కబడ్డీ పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల విజయదుందుభి! గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల హల్‌చల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బీపీఎం రంగంలో భారీ మార్పులు: ప్రపంచ ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్‌గా భారత్.. నాస్కామ్ వెల్లడి LT, HT విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు – పారదర్శకత, సరళత, వేగవంతమైన సేవలు ఆగస్టులో దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 7.5 శాతం తగ్గుదల: ఐఏటీఏ నివేదిక వెల్లడి పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాలి.. బదిలీపై వెళ్లిన ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి సన్మానం తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన ఉపాసులో వరల్డ్ హార్ట్ డే పై అవగాహన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సౌర విద్యుత్ ప్లాంట్‌కు భూమిపూజ

మూడు గ్రామాలను కలిపే నక్షబాటపై కబ్జా ఆరోపణలు.. ప్రజా రహదారిపై ప్రహరీ గోడ నిర్మాణం

Select Suryaa Now
మూడు గ్రామాలను కలిపే నక్షబాటపై కబ్జా ఆరోపణలు.. ప్రజా రహదారిపై ప్రహరీ గోడ నిర్మాణం
మేడ్చల్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 30):మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజబొల్లారం తండా రెవెన్యూ ప్రాంతంలో కీలకమైన నక్షబాట రహదారి కబ్జాకు గురవుతోందనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాజబొల్లారం, ఘనాపూర్, అక్బర్జాపేట్ తదితర మూడు ప్రధాన గ్రామాలను కలుపుతూ నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ప్రజా రహదారిపై కొందరు అక్రమంగా ప్రహరీ గోడ నిర్మిస్తున్నారంటూ స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్లు 374, 375 పరిధిలో ఉన్న ఈ నక్షబాట అలైన్మెంట్‌ను మార్చేసి, రహదారిని కుదించే కుట్ర జరుగుతోందని బాధితులు వాపోతున్నారు. ఈ అక్రమ నిర్మాణాల విషయమై ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నత అధికారులకు పలుసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.ప్రభుత్వ రికార్డులలో స్పష్టంగా నక్షబాటగా నమోదైన ఈ మార్గంలో నిర్మాణాలు జరుగుతున్నా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు వ్యక్తుల బలవంతపు ఆక్రమణల వల్ల భవిష్యత్తులో మూడు గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కేవలం అధికారుల ఉదాసీనత వల్లే అన్యాక్రాంతం అవుతున్న ఈ ప్రజా రహదారి హద్దులను వెంటనే సర్వే చేసి గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని, సర్వే నంబర్లు 374, 375 పరిధిలో నిపుణులతో సమగ్ర సర్వే నిర్వహించి వాస్తవాలను బయటపెట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
 
రిపోర్టర్ తలారి శివకుమార్.