BREAKING
తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాల్లో కనీస మద్దతు ధరకు పప్పుధాన్యాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం జీవ వైవిధ్యంతోనే మానవ మనుగడ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3 పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం పలు నూతన డిజిటల్ సేవలను ప్రారంభించనున్న రక్షణ మంత్రి ఫార్మసీలో మేనేజ్మెంట్ కోటా సీట్లను పెంచాలి కాంస్య పోరులో పరాజయం పాలైన అస్మిత డే భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఆయుష్ సేవలు మషాఅల్లా ఎంటర్‌ప్రైజెస్ పేరుతో భారీ మోసం.. స్క్రబ్బర్ల వ్యాపారం పేరుతో రూ. 500 కోట్ల వసూలు ఈసీఐఎల్‌లో హిట్ అండ్ రన్.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన బాక్సర్ ప్రియా ఘంఘస్‌కు రాష్ట్రపతి అభినందనలు హెలిప్యాడ్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికిన ఆకుల నరసన్న పటేల్ సిద్ధార్థ్ మల్హోత్రా 'ది వ్వాన్' మూవీ కలెక్షన్ల జోరు: రూ. 48 కోట్లు దాటిన వసూళ్లు విమానంలో పెను ప్రమాదం తప్పిన వైనం.. కాక్‌పిట్‌లో పైలట్, కో-పైలట్ మధ్య ఘర్షణ రహదారుల దుస్థితిపై ఎమ్మెల్యే పంచకర్ల సీరియస్.. ఆర్ అండ్ బి అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ పట్టివేత

విద్వేషా దూషణలతో కాలక్షేపం చేస్తూ పరిపాలనను గాలికి వదిలేశారు..మాజీ మంత్రి పువ్వాడ ఆరోపణ.

Select Suryaa Now
విద్వేషా దూషణలతో కాలక్షేపం చేస్తూ పరిపాలనను గాలికి వదిలేశారు..మాజీ మంత్రి పువ్వాడ ఆరోపణ.

ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో/సూర్య ప్రతినిధి::,అబద్ధాలు,విద్వేషా దూషణలతో కాలక్షేపం చేస్తూ రాష్ట్రంలో పరిపాలనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాలికి వదిలేశారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆవేశానికి లోనై ఆక్రోశంతో సిరిసిల్ల సభలో కేసీఆర్, కేటీఆర్‌పై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు.బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గౌరవం,సంస్కారం పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందని కానీ అందుకు భిన్నంగా వ్యక్తిగత విమర్శలు, అసభ్య పదజాలంతో రేవంత్ రెడ్డి మాట్లాడటం బాధ్యతారాహిత్యమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ విమర్శించారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాల్సిన సమయంలో బీఆర్ఎస్ ముఖ్యనేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, పరిపాలనలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం సిరిసిల్ల సభలో రేవంత్ రెడ్డి చేశారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.