BREAKING
పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా.. ఎస్పీ డాక్టర్ వినీత్ ఏడాది ప్రయాణంపై సూర్య ప్రత్యేక కథనం అమెరికా లేబర్ మార్కెట్‌లో జోరు: జూలై తర్వాత కనిష్టానికి నిరుద్యోగ క్లెయిమ్‌లు.. 1.97 లక్షలకు క్షీణత! ‘ఆ అనుభూతిని మళ్లీ ఆస్వాదించాలనుంది’: ముంబైలో ఎఫ్‌డీఏ కొరడా : తుకారాం ముండే నేతృత్వంలో మెరుపు దాడులు! పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా ఎయిర్‌ఫోర్స్ మెగా డీల్‌పై కన్ను: నాగ్‌పూర్‌లో C-390 మిలిటరీ విమానాల అసెంబ్లీ లైన్ ఏర్పాటుకు ‘ఎనర్జీ డ్రింక్’ లేబుల్ నిషేధంపై న్యాయపోరాటం సీల్దా రైల్వే స్టేషన్‌కు సరికొత్త శోభ: మల్టీప్లెక్స్, గేమింగ్ జోన్, స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు.. భారత్‌తో సముద్రయాన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: గ్రీస్ డిప్యూటీ మంత్రి స్టెఫానోస్ గికాస్ నేటి రాశి ఫలాలు — 2 అక్టోబర్ 2026, శుక్రవారం నేటి పంచాంగం తేదీ: 2 అక్టోబర్ 2026, శుక్రవారం అలుపెరుగని పోరాటం.. నిస్వార్థపు సేవయే ఎబివిపి ధ్యేయం : జిల్లా కన్వీనర్ మన్నె సతీష్ రాత్రి భోజనం చేశాక వెంటనే పడుకుంటున్నారా? మీ ఆరోగ్యం ముప్పులో ఉన్నట్టే! రవితేజ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు.. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో సరికొత్త ప్రయోగం

సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు

Select Suryaa Now
సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి  -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు
 
-​గజ్వేల్ గడీని బద్దలు కొట్టినట్లే సిరిసిల్ల గడీని నేలమట్టం చేయాలి
-​పదేళ్ల పాలనలో సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చిన కేసీఆర్, కేటీఆర్
-​నేతన్నల ఓట్లను కుటుంబ ఆస్తులుగా మార్చుకున్న వైనంపై తీవ్ర ధ్వజం
-​రాబోయే రోజుల్లో పద్మశాలి బిడ్డకు శాసనమండలి పదవి, సిరిసిల్లలో గెలిచిన నాయకుడికి మంత్రి పదవి
-మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర
-అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు 
​సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి:గజ్వేల్ గడీని బద్దలు కొట్టి అధికారాన్ని దక్కించుకున్నట్లే, రాబోయే రోజుల్లో కార్యకర్తలు ఫిరంగులై సిరిసిల్ల గడీని నేలమట్టం చేసి కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం సిరిసిల్ల పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల అంటే సిరులకు నిలయమని, కానీ గత పదేళ్ల భారత రాష్ట్ర సమితి పాలనలో అది కాస్తా నేతన్నల ఆత్మహత్యలతో 'ఉరిసిల్ల'గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రగా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ప్రజల కళ్లల్లో మార్పు తాలూకు ఆశ, వెలుగు స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు.
​
-ఓట్లను సొమ్ము చేసుకున్న తండ్రీకొడుకులు
 
మనిషి నాగరికతకు మొదటి అడుగు వస్త్రమని, అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన ఘన చరిత్ర కలిగిన సిరిసిల్ల నేతన్నల నైపుణ్యాన్ని కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. 2009 ఉద్యమ సమయంలో అప్పటికే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసిన కేకే మహేందర్ రెడ్డికి అన్యాయం చేసి, అమెరికా నుంచి కొడుకు కేటీఆర్ ను తీసుకొచ్చి టికెట్ ఇచ్చారని గుర్తుచేశారు. ఆరు సార్లు గెలిపించినప్పటికీ నేతన్నల ఆత్మహత్యలను, గల్ఫ్ వలసలను నిరోధించలేకపోయారని మండిపడ్డారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి మరణించిన కార్మికుల మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడంలో కూడా గత ప్రభుత్వం కనికరించలేదని, ప్రజాపాలన ప్రభుత్వం రాగానే గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించే విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ప్రజల ఓట్లతో వేల కోట్ల రూపాయల ఆస్తులు, ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
​
-దేవుళ్ల పేరిట కూడా మోసమే
 
మానేరు నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరిపి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని, మిడ్ మానేరు ముంపు బాధితుల పేరుతో పేదల హక్కులను హరించి సంతోష్ రావు కుటుంబం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. మానవులనే కాకుండా వేములవాడ రాజన్నను, భద్రాచలం రాముడిని కూడా కేసీఆర్ మాటలతో మోసం చేశారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం పదేళ్లలో నేతన్నల కోసం కెసిఆర్ ప్రభుత్వం 2,234 కోట్లు ఖర్చు చేస్తే, ప్రజాపాలన ప్రభుత్వం కేవలం రెండున్నరేళ్ల కాలంలోనే 1,731 కోట్లను ఖర్చు చేసిందన్నారు. తాజాగా 350 కోట్ల అదనపు నిధులతో కలిపి జిల్లా అభివృద్ధికి సుమారు రూ.1,700 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు. నూలు డిపో, వేములవాడ ఆలయ అభివృద్ధి, సమీకృత పాఠశాలలు, తహసీల్దార్ కార్యాలయాలు, మహిళా, ట్రాఫిక్ ఠాణాల ఏర్పాటుతో పాటు రైతు రుణమాఫీని విజయవంతంగా అమలు చేశామని వివరించారు.
​
-రాబోయే రోజుల్లో సముచిత స్థానం
 
రానున్న శాసనమండలి ఎన్నికల్లో పద్మశాలి వర్గానికి చెందిన వ్యక్తిని శాసనమండలికి పంపేందుకు పార్టీ అధ్యక్షుడితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. అలాగే సిరిసిల్ల గడ్డపై పార్టీ జెండాను ఎగరేసిన నాయకుడికి అధిష్టానం అనుమతితో కేబినెట్ లో మంత్రి పదవి కల్పిస్తామని వెల్లడించారు.అంతకుముందు జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి   రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ చౌక్ నుండి బహిరంగ సభా ప్రాంగణం వరకు వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, స్థానిక ప్రజలతో కలిసి భారీ పాదయాత్ర నిర్వహించారు. దారిపొడవునా ప్రజలు, మహిళలు, కార్మికులు నీరాజనాలు పలికారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు సుదర్శన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, లోక్‌సభ సభ్యులు మల్లు రవి, చామల కిరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు విజయ రమణారావు, బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్, శాసనమండలి సభ్యులు బల్మూర్ వెంకట్, శాసనసభ్యులు వేముల వీరేశం, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ రావు, మదన్ మోహన్ రావు, లక్ష్మీకాంతారావు, సంజయ్, శ్రీ గణేష్, నాగరాజు, భూపతిరెడ్డి, కుంభం అనిల్ రెడ్డి, నవీన్ యాదవ్, శంకర్ నాయక్, సంపత్ కుమార్, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు, మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్ రావు, పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, స్థానిక నేత కేకే మహేందర్ రెడ్డి, ఎరావత్ అనిల్ కుమార్, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.