BREAKING
'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు

విమానంలో పెను ప్రమాదం తప్పిన వైనం.. కాక్‌పిట్‌లో పైలట్, కో-పైలట్ మధ్య ఘర్షణ

Select Suryaa Now
విమానంలో పెను ప్రమాదం తప్పిన వైనం.. కాక్‌పిట్‌లో పైలట్, కో-పైలట్ మధ్య ఘర్షణ

సూర్య అంతర్జాతీయ డెస్క్: దుబాయ్ నుంచి టెల్ అవివ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం ప్రయాణంలో ఉండగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విమానం గాల్లో ఎగురుతున్న సమయంలో దానిని తన నియంత్రణలోకి తీసుకునేందుకు కో-పైలట్ ప్రయత్నించగా, అతని దురుద్దేశాన్ని గ్రహించిన ప్రధాన పైలట్ అడ్డుకునేందుకు యత్నించడంతో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో కాక్‌పిట్‌‌లోనే ఇద్దరి మధ్య పెనుగులాట జరిగి, కో-పైలట్ కత్తితో దాడికి పాల్పడటంతో ఒక్కసారిగా భయాందోళనకర వాతావరణం నెలకొంది.

ఈ అనూహ్య పరిణామాల కారణంగా సుమారు 34 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా 17 వేల అడుగుల దిగువకు పడిపోయింది. పైలట్ల మధ్య జరిగిన ఈ ఘర్షణతో విమానంలోని 174 మంది ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కాక్‌పిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీరి మధ్య గొడవ కొనసాగడంతో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి.

అప్రమత్తమైన సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేయగా, చివరికి సౌదీ అరేబియాలో అత్యవసర ల్యాండింగ్ నిర్వహించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.