మషాఅల్లా ఎంటర్‌ప్రైజెస్ పేరుతో భారీ మోసం.. స్క్రబ్బర్ల వ్యాపారం పేరుతో రూ. 500 కోట్ల వసూలు
సూర్య క్రైమ్ డెస్క్: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయంటూ అమాయక ప్రజలను నమ్కించి భారీ మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు కలకలం రేపుతున్నాయి. ఒక్కో స్క్రిబ్బర్ తయారీ యూనిట్ లేదా వ్యాపారం పేరుతో సుమారు లక్షా ముప్పై వేల రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టాలని, తామే ఆ ఉత్పత్తులను తిరిగి కొనుగోలు చేస్తామని నమ్మబలికి మషాఅల్లా ఎంటర్‌ప్రైజెస్ సంస్థ బోర్డు తిప్పేసినట్లు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి.
ఈ తరహా మోసపూరిత పథకాల ద్వారా ప్రజల నుంచి ఏకంగా రూ. 500 కోట్ల వరకు వసూలు చేసి నిర్వాహకులు పరారైనట్లు సమాచారం. ఎలాంటి కష్టపడకుండా కేవలం కొద్ది రోజుల్లోనే రెట్టింపు డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో సామాన్యులు, నిరుద్యోగులు ఈ మోసపు వలలో చిక్కుకుని సర్వస్వం కోల్పోతున్నారు. ఇటువంటి ఫాస్ట్ మనీ స్కీమ్‌ల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇస్తామనే మోసపూరిత ప్రకటనలను నమ్మి మోసపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.