అక్టోబర్ 6న చలో ఉస్మానియా ను విజయవంతం చేయండి
అక్టోబర్ 6న చలో ఉస్మానియా కు మాదిగ విద్యార్థులు తరలిరావాలి. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు: యాసం రమేష్ మాదిగ.
వెంకటాపురం నూగూరు/ సెప్టెంబర్ 30 (మేజర్ న్యూస్ సూర్య): అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న ఎంఎస్ఎఫ్ బహిరంగ సభను మండలంలోని మాదిగ విద్యార్థులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేయాలని ములుగు జిల్లా వెంకటాపురం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు యాసం రమేష్ మాదిగ పిలుపునిచ్చారు.మంగళవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మన కోసం, మన బంగారు భవిష్యత్తు కోసం బాట వేసిన మాదిగ జాతి జననేత, మరో నవ అంబేద్కర్ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ప్రతి అడుగులో ఆయన మార్గంలో నడుద్దామని, కుల రహిత సమ సమాజం కోసం ప్రయాణం చేద్దామని ఆయన అన్నారు.మూడు దశాబ్దాలుగా అలుపెరగని పోరు సాగించి రిజర్వేషన్ ఫలాలను నేడు మన ముంగిట నిలిపిన మహోత్తర పోరాట యోధుడు మంద కృష్ణ మాదిగ పిలుపు అందుకొని జాతి విద్యార్థి ఉద్యమంలోకి ఉరకలెత్తే ఉత్సాహంతో తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు యాసం మహేష్ మాదిగ, కోగిల మల్లికార్జున్ మాదిగ, వేల్పుల మల్లేష్ మాదిగ, తోకల అంజి మాదిగ, కోగిల సృజన్ మాదిగ, గుద్దేటి నాగరాజు మాదిగ, కోగిల ఆనంద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.