BREAKING
'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు

పౌర హక్కులపై అవగాహనే లక్ష్యం

Select Suryaa Now
పౌర హక్కులపై అవగాహనే లక్ష్యం

*పౌర హక్కులపై అవగాహనే లక్ష్యం*

--- -హక్కులపై చైతన్యమే అభివృద్ధికి బాట.
--- ప్రతి పౌరుడు తన హక్కులను, బాధ్యతలను తెలుసుకోవాలి - సర్పంచ్ నాల్లం వీరస్వామి
--- రాజ్యాంగం కల్పించిన చట్టాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించిన తాసిల్దార్ రాజ్ కుమార్.

సంగెం, సెప్టెంబర్ 30 (మేజర్ న్యూస్ - సూర్య ప్రతినిధి):
ప్రతి పౌరుడు తనకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని ముమ్మిడివరం గ్రామ సర్పంచ్ నాల్లం వీరస్వామి అన్నారు.
బుధవారం ముమ్మిడివరం గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ నాల్లం వీరస్వామి ఆధ్వర్యంలో పౌర హక్కులపై ప్రత్యేక గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగెం తాసిల్దార్ రాజ్ కుమార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా తాసిల్దార్ రాజ్ కుమార్ మాట్లాడుతూ...ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడమే ఈ ప్రత్యేక గ్రామసభ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సమాచార హక్కు చట్టం ( ఆర్ టి ఐ ) ద్వారా ప్రతి పౌరుడు ప్రభుత్వ కార్యాలయాల్లో తన పనుల గురించి సమాచారం తెలుసుకునే హక్కు ఉందని, విద్యా హక్కు చట్టం ద్వారా ప్రతి బిడ్డకు ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు ఉందని వివరించారు. అదేవిధంగా మహిళా హక్కులు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాలపై గ్రామస్తులకు సవివరంగా అవగాహన కల్పించారు. ఎవరైనా తమ హక్కులకు భంగం కలిగితే ఎక్కడ, ఎలా ఫిర్యాదు చేయాలో, ఏ అధికారిని సంప్రదించాలో తెలిపారు.
అనంతరం సర్పంచ్ నాల్లం వీరస్వామి మాట్లాడుతూ... ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలుసుకోవాలని, గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న విద్య, వైద్యం, ఉపాధి హామీ, రేషన్ బియ్యం, ఆసరా పెన్షన్లు, రైతుబంధు వంటి సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా లేదా అని ఈ సభలోనే తెలుసుకుంటామన్నారు.

ఈ గ్రామసభలో గ్రామస్తులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా కొందరికి పెన్షన్లు రాకపోవడం, పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. వాటన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని రిజిస్టర్ లో నమోదు చేసి పరిష్కారానికి కృషి చేస్తామని తాసిల్దార్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి దినేష్, ఉప సర్పంచ్ అమృత, వార్డు మెంబర్లు, మహిళా సంఘాల సభ్యులు, యువకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామసభను విజయవంతం చేశారు.