37 ఏళ్ల పోలీస్ సేవలకు వీడ్కోలు – రిటైర్డ్ పోలీసు అధికారులకు సన్మానం
సూర్య కరీంనగర్:కరీంనగర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సెప్టెంబర్ నెలలో పదవీ విరమణ చేసిన ASI ఆర్. మల్లేశం మరియు సీనియర్ అసిస్టెంట్ డి. రాధాకృష్ణ రెడ్డిలను అడిషనల్ డీసీపీ వెంకటరమణ ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా పోలీస్ శాఖలో 37 సంవత్సరాల పాటు అందించిన సేవలను అడిషనల్ డీసీపీ అభినందించారు. పదవీ విరమణ అనంతరం వారు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వారి సేవలను పోలీస్ శాఖ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని తెలిపారు.కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.