BREAKING
పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు బంగారు బందరుగా మచిలీపట్నం తీర్చిదిద్దుతాం అమ్మవారి శరన్నవ రాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన లాట్వియా విమానయాన సంస్థ 'ఎయిర్‌బాల్టిక్' అమెరికా దివాళా కోర్టును ఆశ్రయించడం పెద్ద జూదం

సమాజానికి అవసరమైన వార్త కథనాలను ప్రచురించాలి .. మీడియా అకాడమీ చైర్మన్ కి శ్రీనివాస్ రెడ్డి

Select Suryaa Now
సమాజానికి అవసరమైన వార్త కథనాలను ప్రచురించాలి  .. మీడియా అకాడమీ చైర్మన్ కి శ్రీనివాస్ రెడ్డి

 సూర్య బాన్సువాడ: జర్నలిస్టులు సమాజానికి, ప్రజలకు మధ్య   వారధిగా పనిచేయాలని మీడియా అకాడమీ చైర్మన్ కి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జర్నలిస్టులు సమాజంలో నైతిక విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని ఆయన జర్నలిస్టులకు సూచించారు జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా రాస్తూ, ప్రజలకు వాస్తవాలను చేరవేసే బాధ్యతాయుతమైన పాత్రికేయులుగా ముందుకు సాగాలని ఆయన అన్నారు.కామారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాలకు చెందిన జర్నలిస్టుల కోసం తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో బాన్సువాడలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో కె. శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడారు.పత్రికలు, టీవీ ఛానళ్లు, డిజిటల్ మీడియా ద్వారా ప్రజలకు చేరే వార్తలు వాస్తవాధారంగా, ఆసక్తికరంగా, సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని ఆయన సూచించారు. జర్నలిస్టులు కేవలం వార్తలను అందించడానికే పరిమితం కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే వారధులుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ హాజరయ్యారు. అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీపీఆర్వో, బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి టీయూడబ్ల్యూజే-ఐజేయూ రాష్ట్ర నాయకులు ఇంద్రసేనారెడ్డి, లతీఫ్, జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్, ప్రధాన కార్యదర్శి రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బైరి సుధాకర్ గౌడ్, జిల్లా నాయకులు ఎర్రవట్టి పోశిరాం, పండరి గౌడ్, ప్రచేతన్, చిన్నం వార్ రామ్మోహన్, చంద్రశేఖర్, మారుశెట్టి హనుమాడ్లు, కోటగిరి సతీష్, రుద్రంగి అశోక్, బర్ల సుధాకర్, శ్రీకాంత్ రెడ్డి, రమణ, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.